కన్నూర్ స్క్వాడ్.. ఓటీటీలో ఇదేమి రెస్పాన్స్ బాబోయ్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా నటించిన 'కన్నూర్ స్క్వాడ్' ఇటీవల థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది.

Update: 2023-11-20 09:34 GMT

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా నటించిన 'కన్నూర్ స్క్వాడ్' ఇటీవల థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీకి మరింత ఆదరణ లభిస్తుంద ఈ సినిమాని చూస్తున్నంత సేపు కార్తి నటించిన 'ఖాకి' కమల్ హాసన్ నటించిన 'రాఘవన్' వంటి సినిమాలు గుర్తుకొస్తాయి.

ఎందుకంటే ఈ సినిమాల మెయిన్ ప్లాట్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ కాప్ థ్రిల్లర్ గా కన్నూర్ స్క్వాడ్ మూవీని కొన్ని నిజమైన సంఘటన లను ప్రేరణగా తీసుకొని రూపొందించారు. కేరళలో క‌న్నూర్ స్వ్కాడ్ పేరుతో నిజంగానే ఓ స్పెష‌ల్ పోలీస్ టీమ్‌ ఉండేది. ఆ టీమ్ సాల్వ్ చేసిన కొన్ని కేసుల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను తీశారు.

ఇందులో జార్జ్ మార్టిన్ పాత్రలో మమ్ముట్టి కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఎటువంటి హీరోయిజం, ఎలివేషన్ సీన్స్ వంటివి లేకుండా కథలో ఇన్వాల్వ్ అయి మమ్ముట్టి నటించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా సినిమాలో పోలీస్ ప్రొసీడింగ్స్ గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. సినిమాలో విజువల్స్, యాక్టర్స్ పర్ఫామెన్స్ లతో పాటూ యాక్షన్ సీన్స్ కూడా చాలా నాచురల్ గా డిజైన్ చేశారు.

72 ఏళ్ల వయసులోనూ మమ్ముట్టి ప్రతి ఫ్రేమ్ లో తన ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేశారు. సినిమాలో తన హావభావాలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. వీటితోపాటు నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక డైరెక్టర్ రాబీ వర్గీస్ రాజ్ దర్శకుడిగా మొదటి ప్రయత్నాన్ని కచ్చితంగా అభినందించే తీరాలి. ఎందుకంటే సినిమా కథనాన్ని అతను నడిపించిన విధానం తన దర్శకత్వ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. మొదటి సినిమానే ఇంత గ్రిప్పింగా తెరకెక్కించిన ఈయన రాబోయే రోజుల్లో మలయాళ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందుతాడని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాని ఎవరైనా చూసి ఉండకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. అస్సలు మిస్ అవ్వొద్దు.

Tags:    

Similar News