కుందాపురం నుంచే కాంతార ఆట
వచ్చే వారం నుంచి మొదటి షెడ్యూల్ షూటింగ్ కి రంగం సిద్దం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే కుందాపురంలో భారీ సెట్ నిర్మించారు
'కాంతార' కి ప్రీక్వెల్ గా 'కాంతార-1' రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి రిషబ్ శెట్టి అండ్ కో స్క్రిప్ట్ పనుల్లోనే తలమునకలై ఉన్నారు. హొంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియాలో భారీ బడ్జెట్ తో నిర్మించడనికి ముందుకు రావడంతో స్క్రిప్ట్ పై మరింత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తాజాగా స్క్రిప్ట్ లాక్ అవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గా లనుంచి తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
వచ్చే వారం నుంచి మొదటి షెడ్యూల్ షూటింగ్ కి రంగం సిద్దం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే కుందాపురంలో భారీ సెట్ నిర్మించారు. కుందాపురంతో పాటు చుట్టు పక్క ఫారెస్ట్ ఏరియాలోనూ షూటింగ్ చేయనున్నారు. నైట్ సన్నివేశాల చిత్రీకరణ అంతా అక్కడే ఉంటుందని సమాచారం. సినిమాలో ఆసన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. 20 రోజుల పాటు అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట.
ప్రస్తుతం ఈ సినిమా కోసం రిషబ్ శెట్టితో పాటు మరికొంత మంది నటులు కళరిపయట్టు..గుర్రపుస్వారీ కి సంబంధించి కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ కథని చెప్పడం కోసం రిషబ్ శెట్టి కొన్ని రకాల తాళ పత్ర గ్రంధాల్ని కూడా ఆధారంగా చేసుకుని కథ సిద్దం చేసాడని వినిపిస్తుంది. వందేళ్ల పాటు ఉన్న కొంత మంది పాతతరం మనుషుల్ని కలిసినట్లు సమాచారం. ఆ సమాచారం ఆధారంగానే తన కథని వీలైనంత నేచురల్ గా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'కాంతార' 400 కోట్ల వసూళ్ళను సాధించింది. తెలుగులోనూ భారీ విజయం సాధించింది. దీంతో 'కాంతార' ప్రీక్వెల్ ప్రకటన మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. భూత కోలం కాన్సెప్ట్ ని మరింత లోతుగా ప్రీక్వెల్ లో చూపించనున్నారు.