OTT ల‌పై క‌త్తి దూసిన కాంతార స్టార్

ఒక పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఆశించిన ఫ‌లితం అందుకోక‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది.

Update: 2023-11-29 04:54 GMT

కన్నడ సినిమాలను OTT లు దూరం పెడుతున్నాయ‌ని 'కాంతార‌' స్టార్ రిషబ్ శెట్టి విమర్శించారు. మంగళవారం నాడు 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజ‌రైన ఆయ‌న‌ మాట్లాడుతూ OTT దిగ్గజాల పట్ల నిరాశను వ్యక్తం చేస్తూ కన్నడ సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డం 'చాలా చెడ్డ సంకేతం' అని అన్నారు.

``OTT ప్లాట్‌ఫారమ్‌లు కన్నడ రంగంలో సినిమాల‌ను కొన‌వు. ఇది చాలా చెడ్డ సంకేతం. ఇక్కడ చందాదారులు లేరని, విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. ఒక పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఆశించిన ఫ‌లితం అందుకోక‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. కరోనా సమయంలోను రెండు ప్రొడక్షన్ హౌస్‌లు చురుకుగా పనిచేసాయి. రక్షిత్ శెట్టి పరమవా స్టూడియోస్ .. నా (రిషబ్ శెట్టి) సినిమాలు.. అంతే కాకుండా, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు కూడా సినిమాలు చేస్తున్నాయి. మేము చురుగ్గా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొంటున్నాము. కానీ ఓటీటీలు సినిమాలు తీసుకోవడం లేదు`` అని రిషబ్ శెట్టి అన్నారు. ``మా చిత్రాలకు గుర్తింపు` పొందడంలో సహాయం చేయవలసిందిగా కాంతార స్టార్ రిష‌బ్ IFFIని అభ్యర్థించారు. థియేటర్లలో తక్కువ ఎక్స్ పోజర్ ఉన్న చిత్రాలకు కూడా కొంత గుర్తింపు రావాలి. వాటిని OTT ప్లాట్‌ఫారమ్‌లకు తీసుకెళ్లాలి`` అన్నారాయన.

రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2లో న‌టిస్తున్నారు. దీనికి అధికారికంగా `కాంతార: చాప్టర్ 1` అని పేరు పెట్టారు. రిషబ్ శెట్టి రక్తంతో తడిసిపోయి కనిపించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రివీల్ అయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కాంతార‌ 2 గురించి మాట్లాడుతూ శెట్టి ప్రేక్షకులు నిజానికి పార్ట్ 2 అని అనుకుంటున్నారు. కానీ ఇది కాంతార ప్రీక్వెల్. కాంతార‌పై అపారమైన ప్రేమను, మద్దతును చూపిన ప్రేక్షకులకు ధ‌న్య‌వాదాలు. వారిక‌ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సర్వశక్తిమంతుడైన దైవానుగ్రహంతో ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రీక్వెల్‌ను ప్రకటించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. కాంతార నిజానికి పార్ట్ 2, పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుంది``అని చెప్పాడు.

Tags:    

Similar News