ఈ టై ఒక అందగత్తె జడలా కనిపిస్తోంది కరణ్
ఈ టై ఖరీదు అక్షరాలా రెండు లక్షలు (రూ.2,00,000). కానీ ఈ సందర్భంలో అతడి ప్రత్యేకతను అది హైలైట్ చేసింది. ప్యారిస్ రెడీ-టు-వేర్ ఫ్యాషన్ వీక్‌లో ఇదే టై మొదటిసారిగా కనిపించింది.
కరణ్ జోహార్ ఫ్యాషన్ సెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి కోసం ప్రఖ్యాత డిజైనర్లు క్యూలో ఉంటారు. తనకోసం ప్రత్యేకమైన డిజైనర్ దుస్తులను తయారు చేసి అందిస్తుంటారు. వాటిని ధరించి టింగురంగడిలా పబ్లిక్ లో అతడి ప్రదర్శనలు నిరంతరం చర్చగా మారుతుంటాయి. పెళ్లికి వెళ్లినా, అవార్డుల ఈవెంట్లకు వెళ్లినా, కాఫీ విత్ కరణ్ లో కనిపించినా అతడు ప్రతిసారీ ఒక స్టార్ హీరో కంటే ఎక్కువగా హైలైట్ అవుతుంటాడు. అంతగా అతడి ఫ్యాషన్ సెన్స్ మెప్పిస్తుంటుంది. చాలాసార్లు రణవీర్ సింగ్ తరహాలో బోల్డ్ అవతార్ లో కనిపించేందుకు అతడు వెనకాడడు. ఇప్పుడు కూడా అదే విధంగా కరణ్ ఫ్యాషన్ సెన్స్ చర్చగా మారింది.
ఇటీవలి ముంబై ఈవెంట్‌లో కరణ్ తన ఉన్నతమైన ఫ్యాషన్ శైలిని ప్రదర్శించాడు. కానీ ఈసారి అతడు అసాధారణమైన ఫ్యాషన్ లేబుల్ షియాపరెల్లి రూపకల్పనలోని హెయిర్ టైతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్‌ను భారతదేశంలో ప్రారంభించిన సందర్భంగా చిత్రనిర్మాత కరణ్ జోహార్ లేబుల్ క్రెస్టెల్లి నుండి లేత గోధుమరంగు సూట్ ధరించి షార్ప్‌గా కనిపించాడు. అయితే అతని టై విషయంలోనే ప్రపంచం ఉలిక్కిపడింది. ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ స్కియాపరెల్లి ఆటం-వింటర్ 2024 సేకరణ నుండి అల్లిన హెయిర్ లుక్ డిజైన్ తో నెక్‌టై సాంప్రదాయ నెక్‌వేర్ తో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ టై ఒక అందగత్తె జడలా కనిపిస్తోంది.
ఈ టై ఖరీదు అక్షరాలా రెండు లక్షలు (రూ.2,00,000). కానీ ఈ సందర్భంలో అతడి ప్రత్యేకతను అది హైలైట్ చేసింది. ప్యారిస్ రెడీ-టు-వేర్ ఫ్యాషన్ వీక్‌లో ఇదే టై మొదటిసారిగా కనిపించింది. ఇది మళ్లీ షియపరెల్లి కచేరీలలో ఒక డిజైనర్ పీస్.. ఇప్పుడు కరణ్ వల్ల దాని పాపులారిటీ మరింత పెరిగింది.
నిర్మాతగా కరణ్ జోహార్ ఇటీవల కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అందువల్ల అతడు ధర్మ ప్రొడక్షన్స్ లో మెజారిటీ షేర్ ని సారేగమ సంస్థకు విక్రయించనున్నాడని కథనాలొచ్చాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి.