ఈ ఇండ‌స్ట్రీని చెడ‌గొట్టింది నువ్వు! అగ్ర‌నిర్మాత‌పై ట్రోల‌ర్ ఫైర్!!

మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్. అతడు త‌న‌ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడ‌క్ష‌న్స్‌ని ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ స్థానంలో నిల‌బెట్టిన ప్ర‌తిభావంతుడు.;

Update: 2025-03-20 14:53 GMT

మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్. అతడు త‌న‌ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడ‌క్ష‌న్స్‌ని ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ స్థానంలో నిల‌బెట్టిన ప్ర‌తిభావంతుడు. ధ‌ర్మ‌ నిర్మించిన చాలా సినిమాలు భారీ బ్లాక్‌బస్టర్‌లు గా నిలిచాయి. ఫ్లాపులు ఉన్నా కానీ ప‌రిశ్ర‌మ కోసం నిల‌బ‌డింది ఈ బ్యాన‌ర్. అయితే ఈ బ్యాన‌ర్ లో గ‌త‌ చిత్రం నాదానియన్‌ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. క్రిటిక్స్ ఒక రేంజులో విమ‌ర్శించారు. అయితే అప్ప‌టికి సైలెంట్ గా ఉన్న చిత్ర‌నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు త‌న మౌనాన్ని విరమించాడు. తాజాగా అత‌డు ఒక సుదీర్ఘ‌మైన నోట్ రాసాడు.

నాదానియన్ అనే పేరు పెట్టలేదు కానీ అత‌డు రాసిన నోట్ సారాంశం దానిని గుర్తు చేస్తోంది. ఒక డిజాస్ట‌ర్ సినిమాతో స్టార్ కిడ్స్ ని లాంచ్ చేసినందుకు నెటిజ‌నుల ఉద్దేశాలు ఆయ‌న‌ను బాధ‌పెట్టాయి. అత‌డు తీవ్రంగా క‌ల‌త చెందాడు. క‌ర‌ణ్ తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన లేఖ‌లో సారాంశం ఇలా ఉంది.

నేను 2003లో కల్ హో నా హోతో సినిమాలు నిర్మించడం ప్రారంభించినప్పుడు, కథకులు, మేక‌ర్స్‌కి అధికారం ఇవ్వడం అంటే సినిమాను ముందుకు తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌. స‌రిగా అర్థం చేసుకున్నామా లేదా త‌ప్పుగా అర్థం చేసుకున్నామా! ఏదైనా కానీ, ఉద్దేశ్యం మేం నమ్మిన సినిమాలు, కథలను తెర‌కెక్కించి విడుదల చేయడమే. మా ఉద్దేశ్యం వినోదం అందించ‌డం.. థియేట‌ర్ల‌లో ఆనందించడం..అంతే!

ధ‌ర్మ సంస్థ‌లో 24వ డెబ్యూ ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేసామ‌ని చెప్ప‌డానికి గ‌ర్విస్తున్నామ‌ని కూడా క‌ర‌ణ్ తెలిపారు. మేం ప‌రిచ‌యం చేసిన‌ వారిలో 90 శాతం మంది బయటి వ్యక్తులు అని కూడా క‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా గుర్తు చేసుకున్నాడు. నా సినిమా విడుదలకు ముందు.. నేను చాలా అరుదుగా నోట్స్ రాస్తాను.. కానీ కొన్ని సినిమాలు నన్ను ఎగ్జయిట్ చేస్తాయి. ఆ సినిమాల‌ ప్రక్రియ ఎలా ఉందో నాకు స్ఫూర్తినిస్తాయి అని అన్నారు.

ఒక విమర్శకుడు ``నేను ఈ సినిమాను తొలగించాలనుకుంటున్నాను`` అని రాశాడు. అలాంటి వ్య‌క్తుల‌తో నాకు పెద్ద సమస్యలు ఉన్నాయి. నాకు పరిశ్రమ, ట్రోల‌ర్స్, మేక‌ర్స్ అభిప్రాయాలు, సామాజిక వ్యాఖ్యానాలతో ఎలాంటి సమస్యలు లేవు. నేను సంతోషంగా ప్రజల అభిప్రాయాలను అంగీకరిస్తున్నాను. కానీ స‌మీక్ష‌ల్లో అలా చెత్త‌గా రాస్తే అది సినిమాని ప్ర‌తిబింబించ‌దు.. మిమ్మ‌ల్ని ప్ర‌తిబింబిస్తుంది..! అని రాసారు.

అయితే ట్రోల‌ర్స్ అతడికి వ్య‌తిరేకంగా స్పందించారు. ప్రియమైన కరణ్.. ఇది నేపో పిల్లల గురించో లేదా బయటి వ్యక్తుల గురించో చ‌ర్చ‌ కాదు. కానీ వారు ప్రతిభతో సేవ చేయగలరా లేదా అనేది ముఖ్యం.. అని ట్రోల‌ర్ కౌంట‌ర్ వేసారు. మరొక నెటిజ‌న్ ఇలా విమ‌ర్శిస్తూ రాసారు. ``నువ్వు ఏమి చెప్పినా.. ప్రతిభను చెడగొట్టేవాడివి.. బాలీవుడ్‌ను నాశనం చేసేవాడివి.. అది ఇప్పుడు దక్షిణాదిని మరింత వినోదాత్మకంగా ప్రతిభావంతుల స్థ‌లంగా మారుస్తోంది.. ఇప్పుడు ఎలైట్ కాలేజీ తరహా సినిమాలు..ప్రతిభ లేని నెపో పిల్లలకు స‌రికాదు! `` అని రాసారు.

Tags:    

Similar News