రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టు అతడేనా?
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.;

నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, ఇందులోని స్పెషల్ సాంగ్ ను కేతిక శర్మ చేసింది.
భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబిన్‌హుడ్ దాన్ని మించిన హిట్ అవుతుందని అటు నితిన్, ఇటు డైరెక్టర్ వెంకీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
దానికి తగ్గట్టే సినిమాకు సంబంధించిన పాటలు, పోస్టర్లు, టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్, సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. వార్నర్ కు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటం, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలంటే ఎక్కువ ఇష్టమని అందరికీ తెలుసు. తెలుగు సినిమాలకు సంబంధించిన ఎన్నో రీల్స్ ను చేసి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
వార్నర్ ఇంట్రెస్ట్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే రాబిన్‌హుడ్ టీమ్ ఆయన్ని గెస్ట్ రోల్ కోసం ఒప్పించారు. రీసెంట్ గానే సినిమాలో ఆయన లుక్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో వార్నర్ షార్ట్ హెయిర్ లో మాస్ ఎక్స్‌ప్రెషన్స్ తో కనిపించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ డేవిడ్ వార్నర్ ను చీఫ్ గెస్టుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుందట. ఇప్పటికే ఆ ఈవెంట్ కు సంబంధించిన పర్మిషన్స్ కూడా వచ్చాయని, రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా భారీ ఎత్తున చేయాలని మేకర్స్ డిసైడైనట్టు తెలుస్తోంది. వార్నర్ తో పాటూ పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నారని సమాచారం. ఇదే నిజమైతే రాబిన్‌హుడ్ మూవీపై హైప్ ఆకాశాన్నంటడం ఖాయం.