డైరెక్టర్ కి డిప్రెషన్ తో బిగ్ ఫైట్ !
కరణ్ జోహార్ మహమ్మారి సమయంలో నిరాశకు గురికావడం, వృత్తిపరమైన సహాయం కోరడం గురించి మాట్లాడాడు.
దీపికా పదుకొనే తీవ్రమైన డిప్రెషన్ తో ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలతో జీవించారన్న సత్యాన్ని అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేరు. నిజానికి డిప్రెషన్ అనేది సమాజంలో ఒక వైరస్ లాంటిది. ఇది ప్రజలందరినీ చుట్టేస్తోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు దర్శకనిర్మాత కరణ్ జోహార్ డిప్రెషన్‌లో ఉన్నానని అన్నారు. కాఫీ విత్ కరణ్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్‌లో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాడు. KWK8 ఎపిసోడ్ 1కి అతిథులు దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ జంట హాజరు కాగా మాటల సందర్భంలో ఆయన ఈ విషయాన్ని రివీల్ చేసారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఎసిసి) ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు తాను మొదటిసారిగా ఆందోళనకు గురయ్యానని కరణ్ వెల్లడించారు.
ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ దీపికా- రణవీర్‌లతో కరణ్ ఇలా అన్నాడు, ``NMACC లాంచ్‌లో ఉన్నప్పుడు నాపై డిప్రెషన్ దాడి జరిగింది. నా వైపు వరుణ్ ధావన్ తదేకంగా చూస్తున్న విషయం నాకు ఇంకా గుర్తుంది. నాకు చెమటలు పట్టాయి. నా ముఖం చెమటతో నిండిపోయిందనే విషయం నేను గ్రహించలేదు. వరుణ్ వచ్చాడు. మీరు బాగానే ఉన్నారా? అనడిగాడు. నా చేతులు వణుకుతున్నాయి. తర్వాత అతడు నన్ను ఖాళీగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళాడు. మొదట అది కార్డియాక్ అరెస్ట్ అని అనుకున్నాను. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. నేను నా మంచంపైకి వెళ్లి ఏడ్చాను. నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియలేదు... అని కరణ్ తెలిపారు.
కరణ్ జోహార్ మహమ్మారి సమయంలో నిరాశకు గురికావడం, వృత్తిపరమైన సహాయం కోరడం గురించి మాట్లాడాడు. మహమ్మారి మూడు సంవత్సరాలు పాటు ఒణికించింది. నేను చాలా ఇబ్బంది పడ్డాను అని కరణ్ తెలిపారు. కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఎపిసోడ్ 1లో, కరణ్ జోహార్ తాను ఫ్యాషన్ సెన్స్ పరంగా తన అభిరుచిని మార్చుకున్నానని, వయస్సుకి అనుగుణంగా సూక్ష్మమైన డిజైన్‌లను ఎంచుకున్నానని వెల్లడించాడు. .