ఆయ‌న దృష్టిలో 2023 ఉత్త‌మ చిత్రం యానిమ‌ల్!

మ‌రి 2023 ఉత్తమ చిత్రం ఏది? అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క‌త నిర్మాత ఓ చిత్రాన్ని ప్ర‌త్యేకించి హైలైట్ చేసారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. 'నా దృష్టిలో, యానిమల్ 2023లో ఉత్తమ చిత్రం.

Update: 2024-01-02 12:26 GMT

గ‌తేడాది బాక్సాఫీస్ ని హోరెత్తించిన సినిమాలెన్నో ఉన్నాయి. వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయింది. 'జైల‌ర్'..'జ‌వాన్'..'ప‌ఠాన్'..'యానిమ‌ల్'..'స‌లార్ పార్ట్-1'.. టైగ‌ర్-3 లాంటి సినిమాలు భారీ వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రాలెన్నో. దీంతో 2023 ఇయ‌ర్ ఉత్త‌మ సంవ‌త్స‌రంగానే ముగి సింది. మ‌రి వీటిలో ఉత్త‌మ చిత్రం ఏది? అంటే దేన్ని ప్ర‌త్యేకించి చెప్పలేని ప‌రిస్థితి.

అన్ని సినిమాలు ఒక‌దానికొక‌టి పోటీగానే మంచి ఫ‌లితాలు సాధించాయి. తాజాగా ర‌ణ‌బీర్ కపూర్- సందీప్ వంగ చిత్రం ఏకంగా 900 కోట్ల క్ల‌బ్ ని దాటేసింది. ఇక 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుతుందా? లేదా? అన్న‌ది తెలియాలి. కానీ ట్రేడ్ అంచ‌నా ప్ర‌కారం క‌ష్ట‌మ‌నే తెలుస్తుంది. అలాగే స‌లార్ ఇప్ప‌టికే 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. స్టిల్ ఇంకా వ‌సూళ్ల జోరు కొన‌సాగిస్తుంది.

మ‌రి 2023 ఉత్తమ చిత్రం ఏది? అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క‌త నిర్మాత ఓ చిత్రాన్ని ప్ర‌త్యేకించి హైలైట్ చేసారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. 'నా దృష్టిలో, యానిమల్ 2023లో ఉత్తమ చిత్రం. ఇలా స్పందించ‌డానికి నాకు కొంత సమయం పట్టింది. సినిమాపై కొన్ని ర‌కాల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నా ఉత్త‌మ చిత్రంగా చెబుతున్నాను. నేను 'కబీర్ సింగ్‌'ని కూడా ఎంతో ఇష్ట‌ప‌డ్డాను.

ఆ సినిమా నాకు న‌చ్చింద‌ని..మంచి సినిమా అని చెబితే డ‌ర్టీ సినిమాని ఎలా లైక్ చేస్తార‌ని విమ‌ర్శించారు. కానీ వాటిని ప‌ట్టించుకోలేదు. యానిమ‌ల్ లో ప్ర‌తీ అంశాన్ని ఆస్వాదించాను. క‌థ‌..క‌థ‌నాలు ప్ర‌తీది నాకు కొత్త‌గా అనిపించాయి. మూస చిత్రాల‌కు చాలా భిన్నమైన చిత్ర‌మిది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ మరింత న‌చ్చాయి. వ్య‌క్తిగ‌తంగా ఈ క‌థ‌ని సందీప్ ఎంతో చ‌క్కాగా సిద్దం చేసి తెర‌కెక్కించారు' అని అన్నారు.

Tags:    

Similar News