నటన తప్ప నాకేమి తెలియదు

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం 'ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌' విడుదలకు సిద్ధం అయ్యింది.

Update: 2024-09-04 08:30 GMT

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం 'ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌' విడుదలకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాను లండన్‌లో జరిగిన 67వ BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడి వారితో ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాను ఈనెల 13న ఇండియన్‌ ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా రాబోతుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రంగా హన్సల్‌ మెహతా దర్శకత్వంలో కరీనా కపూర్‌ ఖాన్‌, శోభా కపూర్, ఏక్తా కపూర్‌ లు నిర్మించారు. ఈ చిత్రంలో కరీనా కపూర్‌ ఖాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ గా కనిపించనుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరీనా కపూర్‌ ఖాన్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత వరుస సినిమాల్లో నటించడంపై స్పందించింది. గతంలో పెళ్లి తర్వాత హీరోయిన్స్ ఇంటికే పరిమితం అయ్యే వారు. కానీ కాలం మారిన నేపథ్యంలో హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ ను కొనసాగిస్తున్నారు. పెళ్లికి ముందు ఎలా అయితే నటించారో అలాగే పెళ్లి తర్వాత కూడా నటిస్తూ ఉన్నారు. అందులో కరీనా కపూర్ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. పెళ్లి పిల్లల తర్వాత కూడా కరీనా కపూర్ సినిమాల ఎంపిక విషయంలో ఏమాత్రం మార్పు రాలేదు అనేది చాలా మంది అభిప్రాయం.

వరుస సినిమాల పై కరీనా కపూర్‌ మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ పుట్టాను. చిన్నప్పటి నుంచి సినిమాలకు సంబంధించిన విషయాలను వింటూ పెరిగాను. అప్పుడే పెద్ద అయ్యాక సినిమాల్లో నటించాలని అనుకున్నాను. నేను కోరుకున్నది ఫ్యామిలీ మెంబర్స్‌ అర్థం చేసుకున్నారు. వారి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. చిన్నప్పటి నుంచి కూడా నటన కాకుండా మరే విషయాలపై నేను ఆసక్తి కనబరచలేదు. పైగా నాకు నటన కాకుండా మరేమి తెలియదు. యాక్టింగ్‌ నా రక్తంలోనే ఉంది. జీవితాంతం సినిమా రంగంలో కొనసాగాలని కోరుకుంటున్నాను.

భవిష్యత్తులో కూడా నా నుంచి వరుస సినిమాలు వస్తాయి. ది బకింగ్‌హామ్‌ మర్డర్స్ సినిమా గురించి ఏక్తా కపూర్‌ నా వద్ద చెప్పినప్పుడు తప్పకుండా మంచి సినిమా అవుతుందని అనుకున్నాను. నా కెరీర్‌ ఆరంభం నుంచి ఏక్తా కపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో గతంలో చేసిన ప్రాజెక్ట్‌ లు మంచి స్పందన దక్కించుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నాను. 10 ఏళ్ల బాలుడి హత్య చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది.

Tags:    

Similar News