అప్పుడు ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపా

కరీనా కపూర్ ఖాన్‌ మాట్లాడుతూ... తన పాతిక సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను విజయాల కంటే కూడా ఎక్కువ అపజయాలను చవి చూశాను.

Update: 2024-03-27 12:32 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్‌ 'క్రూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. మరో రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న క్రూ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా కరీనా కపూర్ మీడియాతో ముచ్చటించింది. ఆ సందర్భంగా కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పుకొచ్చింది.

కరీనా కపూర్ ఖాన్‌ మాట్లాడుతూ... తన పాతిక సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను విజయాల కంటే కూడా ఎక్కువ అపజయాలను చవి చూశాను. నేను నా కెరీర్‌ లో పడ్డ ఇబ్బందులు మరెవ్వరు కూడా పడి ఉండరు.

 

జబ్ వి మెట్‌ సినిమా కంటే ముందు నేను చేసిన ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ప్రతి సినిమా కూడా నన్ను నిరాశ పరిచింది. ఎందుకు నేను నటించిన సినిమాలు ఆడటం లేదు, అసలు ఎక్కడ సమస్య ఏర్పడింది అనేది తెలియక ఏడుస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను.

నేను చేసిన చాలా సినిమాలు కమర్షియల్‌ గా ఫ్లాప్ అయినా కూడా నాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చేవి. నువ్వు బాగున్నావు అని, నువ్వు బాగా చేశావు అంటూ చాలా మంది చెప్పేవారు. నాకు దక్కిన విజయాల కంటే పరాజయాలు ఎక్కువ. అందుకే నేను ఎక్కువ మందికి తెలిసి ఉంటాను అనేది నా అభిప్రాయం.

సినిమాల ఎంపిక విషయంలో ఒక కొలమానం అనేది లేకుండా నేను వ్యవహరించేదాన్ని. కథల విషయంలో పట్టింపు లేకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ కి ఓకే చెప్పడం వల్ల నష్టం జరిగింది. కెరీర్‌ లో నాకు పడ్డ ఫ్లాప్స్ మరే హీరోయిన్‌ కి పడ్డా కూడా కచ్చితంగా తట్టుకోలేక పోయేవారు.

ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు హీరోయిన్‌ గా కొనసాగడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా కరీనా కపూర్‌ ఖాన్‌ కి ఇంకా స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్ ఉంది. పెళ్లి చేసుకుని తల్లి అయినా కూడా ఆమె యాక్టింగ్‌ జర్నీ గతంలో మాదిరిగా కొనసాగుతూనే ఉంది. మరో పదేళ్ల పాటు కరీనా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్‌.

Tags:    

Similar News