టీవీ మూవీ నటి బికినీలో దుమారం
కాస్టింగ్ డైరెక్టర్లు తనను ఎప్పుడూ ఒకే కోణంలో చూసేవారని అందుకే తనకు అలాంటి పాత్రల్లో నటించాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించింది.
నటి కరిష్మా తన్నా టెలివిజన్ పరిశ్రమలో పాపులర్ నేమ్. నటిగా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ చివరిసారిగా హన్సల్ మెహతా `స్కూప్`లో నటించింది. ఇందులో తన నటనకు విమర్శకులు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. స్కూప్ లో నటించక ముందు తనకు ఒకే తరహా పాత్రలు వచ్చేవని, తనకు గ్లామర్ పాత్రల్లో మాత్రమే అవకాశాలు కల్పించారని కరిష్మా తన్నా పేర్కొంది. తనకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అవకాశాలు కల్పించలేదని ఆవేదన చెందింది. కాస్టింగ్ డైరెక్టర్లు తనను ఎప్పుడూ ఒకే కోణంలో చూసేవారని అందుకే తనకు అలాంటి పాత్రల్లో నటించాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించింది.
కరిష్మా ఇటీవల సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. తాజాగా అందమైన బికినీలో కనిపించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అయితే ఈసారి కరిష్మా స్పెయిన్ విహారంలో ఉంది. అక్కడ బీచ్ వెకేషన్ నుంచి షేర్ చేసిన ఈ బికినీ లుక్ ఇంటర్నెట్ లో సునామీగా మారింది. కరిష్మా తన్నా టూ హాట్ గా ఉందంటూ అభిమానులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల ముఖ్యంగా నేను ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా పొడవుగా ఉన్నందున అవకాశాలు రాలేదు. నేను చాలా కాలం తర్వాత మాత్రమే నచ్చిన పాత్రలో నటించాను. కొంతమంది నటీమణులు వచ్చి మొత్తం కథనాన్ని సానుకూలంగా మార్చారు.. అని కరిష్మా తన్నా తెలిపింది. OTT నాకు గేమ్ ఛేంజర్.... ప్రజలకు నేను కరిష్మా తన్నా అని తెలుసు అంటే దానికి కారణం ఓటీటీనే.. అని తెలిపారు.