వివాదం మధ్యలో వేలు పెట్టిన సినిమా!
అనుమతి లేకుండా చెట్లు నరకడం అటవీ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందిని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు.
యశ్ కథానాయకుడిగా నటిస్తోన్న `టాక్సిక్` వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. షూటింగ్ నేపథ్యంలో యూనిట్ బెంగుళూరు సమీపంలోని పీణ్య- జలహళి వద్ద అటవీ భూమిలో వేలాది చెట్టు నకరడంపై అటవీ శాఖ సీరియస్ అయింది. అటవీ శాఖ అనుమతి లేకుండా చెట్లు నరకడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అటవీ శాఖ మంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించి శాటిలైట్ ఫోటోలు ట్విటర్ లో షేర్ చేసారు.
అనుమతి లేకుండా చెట్లు నరకడం అటవీ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందిని, శిక్షార్హమైన నేరమని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి అటవీశాఖ చిత్ర యూనిట్ పై పోలీస్ కేసు కూడా నమోదు చేసింది. తాజాగా ఈకేసు పెద్ద వివాదం అయ్యేలా కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర -ప్రభుత్వాల మధ్య ఎంతో కాలంగా జరుగుతోన్న వివాదంలో టాక్సిక్ యూనిట్ వేలు పెట్టినట్లు అయింది. వివరాల్లోకి వెళ్తే..
ఈ భూమికి సంబంధించి కర్ణాటక అటవీ శాఖ- హిందుస్తాన్ మెషిన్ టూల్స్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములను గెజిట్ లో ఎలాంటి అధికారిక నొటిఫికేషన్ లేకుండానే హెచ్ ఎంటీకి ఇచ్చారు. భూమి యాజమాన్య హక్కులపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా నడుస్తోంది. సరిగ్గా అదే చెట్లతో నిండిన భూమిని `టాక్సిక్` నిర్మాతలు తమ సినిమా షూటింగ్ కు అనుకూలంగా ఉంటుందని..వాతావరణం కూడా సహకరిస్తుందని కొన్నాళ్ల పాటు హెచ్ ఎంటీ నుంచి లీజుకు తీసుకుంది.
లీజు నేపథ్యంలో స్థలాన్ని ఎలాగైనా వాడుకొవచ్చు అనే ఉద్దేశంతో టాక్సిక్ యూనిట్ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో షూటింగ్ కి ఆటకంగా ఉన్న చెట్లను నరికేసారు. కొన్ని రోజల క్రితమే ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు సహా కెనెరా బ్యాంక్ జనరల్ మేనేజర్- హిందుస్తాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది.