జపాన్ ఎలా ఉంటుందంటే..: కార్తీ
ఇక ఇప్పుడు జపాన్ కోసం కూడా అతను తెలుగువారి ముందుకు వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
తమిళ హీరో కార్తీ తన సొంత భాషలో కంటే కూడా కొన్నిసార్లు తెలుగులోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఒక విధంగా మొదట్లోనే అతనికి ఎక్కువగా క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ లోనే యుగానికి ఒక్కడు ఆవారా సినిమాలతోనే తెలుగు వారికి బాగా దగ్గరయిపోయాడు. ఇక ఇక్కడ మీడియం రేంజ్ హీరోల తరహాలోనే కార్తి సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడుతూ వస్తోంది.
ఖైదీ సినిమాతో కూడా అతని రేంజ్ మారిపోయింది. తెలుగులో పోటీగా ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కూడా కార్తికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కారణంగా మంచి కలెక్షన్స్ అయితే అందుతున్నాయి. అయితే ఇప్పుడు అతను మరొక డిఫరెంట్ మూవీ తో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తెలుగులో కూడా ప్రతిసారి కార్తీ తన సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పుడు జపాన్ కోసం కూడా అతను తెలుగువారి ముందుకు వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలను మీడియాతో పంచుకున్నాడు. కార్తీ మాట్లాడుతూ.. జపాన్ కథను దర్శకుడు రాజు మురుగన్ రాసుకున్నప్పుడు అందులోని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ తోనే కథ వెళ్లే విధంగా సినిమా చేయాలని అనుకున్నాము.
దర్శకుడు రాజు ఇంతకుముందు మీడియా రిపోర్టర్ గా వర్క్ చేశాడు. రియల్ లైఫ్ లోని నిజమైన సంఘటనల ఆధారంగా ఈ కథను అతను సిద్ధం చేసుకున్నాడు. నేటి సమాజంలోని చాలా అంశాలు ఇందులో హైలెట్ అవుతాయి. ముఖ్యంగా దర్శకుడు మార్క్ కు తగ్గట్టుగా ఇందులో హ్యూమర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అతడు ఊపిరి సినిమాకు కూడా తమిళంలో డైలాగ్స్ రాశాడు.
ఇక జపాన్ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ తో ఉంటుంది. కథ విన్నప్పుడే నన్ను నేను చాలా మార్చుకోవాలని అనుకున్నాను. ఎక్కడ అంచనాలకు తగ్గకుండా సినిమాను తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు చాలా బాగా కృషి చేశారు. ఇక ఈ సినిమాకు తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్ గా ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్.
తప్పకుండా ఈ సినిమా తెలుగు వారికి కూడా చాలా బాగా నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది. దర్శకుడు మేకింగ్ విధానం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అలాగే జీవి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా రేంజ్ ను మరింత పెంచింది. ఇక రాబోయే ప్రాజెక్టులపై క్లారిటీ ఇస్తూ.. ఒక కొత్త ప్రాజెక్టు పై చర్చలు జరుగుతున్నాయని అలాగే 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కూడా సినిమా ఉంటుందని, లిస్టులో సర్దార్ 2, ఖైదీ 2 కూడా ఉన్నాయి అని కార్తీ వివరణ ఇచ్చాడు.