లేడీ అభిమానిపై హీరో అభిమానం అంటే ఇది బాస్!
జన సమూహంలోకి వచ్చినా? ఎయిర్ పోర్టులో దొరికినా? సెల్పీ ప్లీజ్ అంటూ వెంట పడుతుంటారు.
హీరోలతో సెల్పీల కోసం అభిమానులు ఎలా ఎగబడతారో చెప్పాల్సిన పనిలేదు. జన సమూహంలోకి వచ్చినా? ఎయిర్ పోర్టులో దొరికినా? సెల్పీ ప్లీజ్ అంటూ వెంట పడుతుంటారు. కొంత మంది హీరోలు ఓపికగా సెల్పీలు ఇస్తుంటారు. మరికొంత మంది ఇలాంటి వాటిని అవైడ్ చేస్తుంటారు. అయితే అక్కడ పరిస్థితుల్ని బట్టి అవైడ్ చేయడం అన్నది జరుగుతుంటుంది. కొంత మంది ఎలాంటి పరిస్థితులైనా నవ్వుతూ అభిమానుల కెమెరాకి ఫోజులిస్తుంటారు.
ఈ క్వాలిటీ చాలా తక్కువ మంది హీరోల్లోనే కనిపిస్తుంది. తాజాగా ఓ వీడియో చూస్తే ఇది అభిమానం కాదు. అభిమానిపై అభిమానం అనిపిస్తుంది. ఆ హీరో ఎంత ఓపికగా సెల్పీ ఇచ్చాడంటే? చూసారంటే తొలుత కాస్త నవ్వొచ్చినా? అతడి చూపించిన ప్రేమకు మాత్రం సెల్యూట్ చెయ్యాల్సిందే. ఇదిగో ఎయిర్ పోర్టులో ఓయంగ్ హీరో ఇలా చిక్కాడు.
ఎయిర్ పోర్టు లోపలికి వెళ్తోన్న సమయంలో గేట్ వద్ద ఓ లేడీ అభిమాని సెల్పీ అడిగింది ఆ హీరోని. అతడు కాదనకుండా తీసుకోమన్నాడు. దీంతో ఆ లేడీ అభిమాని చేతిలో ఫోన్ తీసుకుని హీరో పక్కనే నుంచుంది. కానీ కంగారులో కెమెరా ఆన్ చేయలేదో? లేక టెక్నికల్ ఇబ్బందో తెలియదు కెమెరా ఓపెన్ అవ్వలేదు. అలాంటప్పుడు ఏ హీరో అయినా ఏం చేస్తాడు. టైమ్ వేస్ట్ అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
కానీ ఈ హీరో మాత్రం ఎంతో ఓపికగా అక్కడే నిలబడి ఫోట ఇచ్చి మరీ వెళ్లాడు. ఆ సమయంలో అతడు కాస్త నవ్వు కున్నాడు. ఆ సన్నివేశాన్ని అక్కడ ఉన్న ఎయిర్ పోర్టు సెక్యురిటీ సిబ్బంది దగ్గరగా గమనించి ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అయినా ఆ హీరో మాత్రం ఏం ఫీల్ అవ్వలేదు. తాను ఆ లేడీ అభిమానికి సెల్పీ ఇవ్వాలనుకున్నాడు...ఇచ్చాడు అవి ఎలాంటి పరిస్థితులైనా సరే. ఇదే కదా అసలైన అభిమానం అంటే. ఇలా అభిమానులపై అభిమానం చూపించే హీరోలు ఎంత మంది ఉంటారు. చెక్ వన్స్.