కార్తి చేస్తానంటున్నా మన వాళ్లే ఇవ్వట్లేదా..?
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కార్తి, నాగార్జున కలిసి ఊపిరి సినిమా చేశారు. ఆ సినిమాతో కార్తి మరింత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
కోలీవుడ్ హీరో కార్తి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అన్న సూర్య తరహాలోనే తన ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు తెస్తున్న కార్తి ఇక్కడ సూర్య కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్ గా జపాన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కార్తి సినిమా తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మకంగా చెప్పారు. జపాన్ సినిమా ప్రమోషన్స్ లో తెలుగు స్ట్రైట్ సినిమా విషయాలను కూడా పంచుకున్నారు కార్తి.
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కార్తి, నాగార్జున కలిసి ఊపిరి సినిమా చేశారు. ఆ సినిమాతో కార్తి మరింత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇన్నాళ్లు తన డబ్బింగ్ సినిమాలతోనే వచ్చే కార్తి ఊపిరితో తన సత్తా చాటాడు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు ఎందుకు చేయట్లేదు అన్న ప్రశ్నకు సమాధానంగా తెలుగు సినిమాలు చేయాలని తనకు ఉందని కాకపోతే తనని ఇంప్రెస్ చేసే కథలు రావట్లేదని అన్నారు కార్తి.
అంతేకాదు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నా అందుకే తెలుగు కథల మీద దృష్టి పెట్టలేకపోతున్నానని అన్నారు కార్తి. కుదిరితే తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తానని అన్నారు. తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమకి తను ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు కార్తి. అయితే కార్తి తెలుగు సినిమాలు చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా దర్శక నిర్మాతలు అతన్ని పట్టించుకోవట్లేదు.
ఒకటి రెండు కథలు అలా వచ్చినా అవి అంత గొప్పగా అనిపించకపోవడంతో కార్తి నో చెప్పారట. కార్తి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తెలుగు, తమిళ భాషల్లో మంచి సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. తన డబ్బింగ్ సినిమా అయినా సరే తెలుగు డబ్బింగ్ తనే చెప్పుకునే కార్తి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే మాత్రం ఇక్కడ ఇంకాస్త క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. కార్తి నటించిన ఖైదీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా సినిమాకు కథల విషయంలో వెరైటీగా ప్రయత్నిస్తున్న కార్తి సినిమా విషయంలో తను మాత్రం ఎప్పుడు ది బెస్ట్ ఇచ్చేస్తున్నాడు. త్వరలోనే కార్తి తెలుగు స్ట్రైట్ సినిమా చేయాలని ఆయన తెలుగు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు సూర్య కార్తి కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ అలాంటి కథ ఇప్పటివరకు రాలేదని చెబుతున్నారు కార్తి. సూర్య కార్తి ఇద్దరు మల్టీస్టారర్ చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.