ప్యాలెస్ నుంచి బయటకు యువరాణి... ఇది రెండోసారి!!

అవును... క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ చేయించుకుంటున్న 42 ఏళ్ల కేట్ మిడిల్టన్... ఈ మధ్య కాలంలో బాహ్య ప్రపంచంలోకి ఒక్కసారే వచ్చారు.

Update: 2024-07-13 23:30 GMT

ఈ ఏడాది మార్చిలో తన అనారోగ్యంపై ప్రకటన చేసినప్పటి నుంచీ బ్రిటన్ యువరాజు విలియం సతీమణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్... నాటి నుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్నారు.. కీమోథెరపీ చేయించుకుంటూ ప్యాలెస్ కే పరిమితమవుతున్నారు! అయితే ఆమె ఒక పర్పస్ మీద బయటకు రాబోతున్నారు!!

అవును... క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ చేయించుకుంటున్న 42 ఏళ్ల కేట్ మిడిల్టన్... ఈ మధ్య కాలంలో బాహ్య ప్రపంచంలోకి ఒక్కసారే వచ్చారు. ఇందులో భాగంగా... ఇటీవల బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 పుట్టిన రోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన "ట్రూపింగ్ ది కలర్" పరేడ్ కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పిల్లలతో కలిసి బగ్గీలో కూర్చుని కనిపించారు.

అయితే తాజా రెండోసారి ఆమె బాహ్యప్రపంచలోకి రాబోతున్నారు. ఇందులో భాగంగా... లండన్ లో జూలై 14న జరిగే వింబుల్డన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు కెన్సింగ్టన్ ప్యాలెస్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2016 నుంచి ఆమె ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోక్వెట్ క్లబ్ కు గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు.

ఇప్పుడు ఆ హోదాలోనే.. ఆదివారం జరిగే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ కు ఆమె హాజరుకానున్నట్లు ప్యాలెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో దిగ్గజ ఆటగాళ్లు నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ లు పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్ లో విజేతకు ఆమె ట్రోఫీ అందజేయనున్నారు!

ప్రస్తుతం క్యాన్సర్ వ్యాదితో బాదపడుతున్న కేట్ మిడిల్టన్... బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 పుట్టిన రోజు పురస్కరించుకుని జరిగిన వేడుకకు ముందు ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. ఇందులో భాగంగా... తనకు సోకిన క్యాన్సర్ కు సంబంధించిన చికిత్స మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని.. ఇప్పటికే పురోగతి కనిపిస్తుందని అని అన్నారు. ఈ సందర్భంగా కీమోథెరపీ చేయించుకుంటున్న అనుభవాన్ని ఆమె తలచుకున్నారు.

ఇందులో భాగంగా... కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి తెలుసు... జీవితంలో మంచి, చెడ్డ రోజులు ఉంటాయని. కొన్ని రోజులు బాగా బలహీనంగా అయిపోయినట్లు ఉంటుంది.. శరీరానికి విశ్రాంతి అవసరం అవుతుంది.. నా శరీరం చెప్పే మాటలు వింటున్నాను.. ఈ వ్యాధి నయం కావడానికి మరింత సమయం పడుతుంది.. ఈ సమయంలో అండగా నిలుస్తోన్న అందరికీ కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News