షాకిస్తున్న స్టార్ హీరోయిన్ నల్లటి మచ్చ!
తెలుగు ప్రేక్షకులకు మల్లీశ్వరిగా సుపరిచితం కత్రిన కైఫ్. టాలీవుడ్‌లో నటించినా నటించకపోయినా కత్రినకు ఇక్కడా భారీ ఫాలోయింగ్ ఉంది.
తెలుగు ప్రేక్షకులకు మల్లీశ్వరిగా సుపరిచితం కత్రిన కైఫ్. టాలీవుడ్‌లో నటించినా నటించకపోయినా కత్రినకు ఇక్కడా భారీ ఫాలోయింగ్ ఉంది. తనదైన అందం, నట ప్రదర్శనతో ఈ బ్యూటీ యువహృదయాల్లో నిలిచి ఉంది. అయితే ఈ బ్యూటీ అనూహ్యమైన కారణంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. కత్రిన ఇటీవల చీరలో విమానాశ్రయంలో ఏదో దాస్తున్నట్టు కనిపించింది. అది దృష్టిని ఆకర్షించింది. అయితే కొందరు డేగకళ్లతో తన చేతిపై నల్లటి మచ్చను కనిపెట్టేసారు. కత్రిన ఎంత దాచాలన్నా దాగలేదు ఈ నిజం. అంతేకాదు.. ఆ మచ్చను చూశాక అభిమానులు తన ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఆందోళన చెందారు. ఒక అభిమాని కత్రినకు డయాబెటిక్ ఉందా? అని డౌట్ వ్యక్తం చేసాడు.
కత్రినా కైఫ్ నవరాత్రి వేడుకల కోసం తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన నారింజ రంగు చీరలో విమానాశ్రయంలో అద్భుతంగా కనిపించింది. పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శిస్తూ కత్రిన ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. కానీ తన విచిత్రమైన ప్రవర్త అందరిలో డౌట్లు పెంచింది. చివరికి తన చేతికి ఉన్న బ్లాక్ ప్యాచ్ ఆశ్చర్యపరిచింది.
ఈవెంట్ నుండి ఫోటోలు, వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ ప్యాచ్. అయితే ఇది చూడగానే అభిమానులు అనుచరుల్లో చాలా ఆందోళన కనిపించింది. డయాబెటిస్ బ్లాక్ ప్యాచ్ ఇది అని ఒక అభిమాని ఊహించారు. ఒక అభిమాని ``ఆమె చేయి మీద నల్లగా ఉన్నది ఏమిటి?`` అని ప్రశ్నించగా... కత్రీనా ఫిట్‌నెస్-కేంద్రీకృత జీవనశైలికి అనుగుణంగా బ్లడ్ షుగర్, హృదయ స్పందన రేటు, నిద్ర విధానాలను పర్యవేక్షించడానికి రూపొందించిన అల్ట్రాహుమాన్ వంటి ఫిట్‌నెస్ ట్రాకర్ పాచ్ కావచ్చునని కొందరు అభిమానులు ఆల్టర్నేట్ అవకాశాన్ని సూచించారు.
అయితే కత్రిన ఈ ప్యాచ్ వెనక కారణమేమిటో ఇంకా చెప్పలేదు. అంతకుముందు లైఫ్‌స్టైల్ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కత్రినా కైఫ్ తన బిజీ షెడ్యూల్ మధ్య విరామం తీసుకోవడం ..వ్యక్తిగత సమయాన్ని కేటాయించడం ప్రాముఖ్యత గురించి చర్చించింది. కుటుంబంతో కనెక్ట్ అవ్వడం.. తాను ఇష్టపడే కార్యకలాపాలలో పాల్గొనడం ఎంత అవసరమో హైలైట్ చేస్తూ మాట్లాడింది. కత్రిన తన ప్రియమైనవారితో గడిపిన క్షణాలు తన డిమాండ్‌తో కూడిన కమిట్‌మెంట్‌ల మధ్య కూడా రీఛార్జ్‌లో సహాయపడతాయని నొక్కి చెప్పింది.
కుటుంబంతో కలిసి ఉండటం శాంతి, పరిపూర్ణతను ఇస్తుందని...హడావిడి లేదా పరధ్యానం లేకుండా జీవితాన్ని ఆస్వాధించడానికి సహకరిస్తుందని కత్రిన తెలిపింది. ప్రజలు సహజంగానే సాధారణ జీవితంలో అందమైన క్షణాల విలువను విస్మరించారని కత్రిన పేర్కొంది. అయితే ఈ అనుభవాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కుటుంబంతో మంచి సమయాన్ని ఆస్వాధించలేకపోవడం చాలా కోల్పోయినట్టేనని కత్రిన అంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... కత్రినా కైఫ్ చివరిసారిగా 12 జనవరి 2024న విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ `మెర్రీ క్రిస్మస్`లో కనిపించింది. కత్రినా రోడ్ ట్రిప్ చిత్రం `జీ లే జరా`లో ఆలియా భట్ - ప్రియాంక చోప్రాతో కలిసి కనిపించనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.