టైగర్ 3: టవల్ ఫైట్‌లో అంత కష్టం దాగుంది
ఒక అందమైన అమ్మాయి.. నాజూకు దేహంతో మైమరిపించే సొగసరి.. యాక్షన్ బ్లాక్ లో దుమ్ము దులిపేస్తుంటే అది వీక్షించేందుకు ఎంతో అందంగా ఉంటుంది.
ఒక అందమైన అమ్మాయి.. నాజూకు దేహంతో మైమరిపించే సొగసరి.. యాక్షన్ బ్లాక్ లో దుమ్ము దులిపేస్తుంటే అది వీక్షించేందుకు ఎంతో అందంగా ఉంటుంది. శత్రువుల అంతు చూసే స్పై ఆపరేషన్ లో ఆ అందగత్తె స్టంట్స్ హొయలు రెండిటిని కలగలిపి ఆడియెన్ ఆస్వాధిస్తారు. అందుకే హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎప్పుడూ ఈ ఫార్ములాను అనుసరిస్తూనే ఉన్నారు. ఇటీవల పఠాన్- జవాన్ లాంటి చిత్రాల్లోను ఇదే ఫార్ములాను అనుసరించగా వర్కవుటైంది. పఠాన్ లో దీపిక పదుకొనే, జవాన్ లో నయనతార నటన స్టంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
అయితే ఇప్పుడు టైగర్ 3లో కత్రిన అంతకుమించి యాక్షన్ తో అదరగొట్టబోతోంది. ధూమ్ 3లో కత్రిన అద్భుతమైన స్టంట్స్ కి ఫిదా కాని వారు లేరు. టైగర్ జిందా హైలో ఒక స్పై పాత్రలో భారీ స్టంట్స్, గన్ ఫైట్స్ తో మతులు చెడగొట్టింది. అదే సమయంలో సల్మాన్ భాయ్ తో రొమాన్స్ ని అదరగొట్టింది. ఇప్పుడు అంతకుమించి టైగర్ 3లో యాక్షన్ బ్లాక్ లతో అలరించబోతోంది. అయితే ఈసారి యాక్షన్ తో పాటు రొమాంటిక్ టింజ్ కోసం కత్రినపై చేసిన ప్రయోగం యువతరంలో వాడి వేడి చర్చకు తెర తీసింది. ఇంతకుముందు ట్రైలర్ లో కత్రిన మరో అందమైన అమ్మాయితో టవల్ ఫైట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ఫైట్ ఇదే తొలిసారి కాదు కానీ, ఫ్రేమ్ లో మురిపిస్తున్న హాట్ గాళ్స్ వల్ల ఈ టవల్ ఫైట్ కి ప్రత్యేక ఆకర్షణ ఉందని అంగీకరించాలి.
హాలీవుడ్ నటి మిచెల్ లీతో కత్రిన స్టంట్ సీక్వెన్స్ చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. బ్లాక్ విడోలో స్కార్లెట్ జోహన్సన్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో జానీ డెప్, బుల్లెట్ ట్రైన్‌లో బ్రాడ్ పిట్, వెనమ్‌లో టామ్ హార్డీతో కలిసి అందాల నటి మిచెల్ నటించారు. తదుపరి `టైగర్ 3`లో కత్రినా కైఫ్‌తో కలిసి నటించడంపై మిచెల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది. టైగర్ 3 ట్రైలర్ లో టవల్ ఫైట్ సన్నివేశానికి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి ముందు తాను - కత్రిన రెండు వారాల పాటు రిహార్సల్ చేశామని మిచెల్ తెలిపారు.
టర్కిష్ హమామ్‌లోని టవల్ పోరాట సన్నివేశం గురించి మిచెల్ మరింత వివరంగా తెలిపారు. సదరు హాలీవుడ్ నటీమణి మాట్లాడుతూ, ``నేను ఆశ్చర్యపోనవసరం లేదు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది మతి చెడగొట్టే ఇతిహాసం అని నేను అనుకున్నాను. రెండు వారాల పాటు ఫైట్ కోసం ప్రాక్టీస్ చేసాం. ఆపై చిత్రీకరణలో పాల్గొన్నాము. ఈ ఫైట్ చేయడం చాలా సరదాగా ఉంది. టైగర్ 3 అంతర్జాతీయంగా విడుదలవుతుండడంతో ఉత్సాహంగా ఉంది`` అని తెలిపారు.
యాక్షన్ సీక్వెన్స్‌లను పర్ఫెక్ట్ గా చేయడంలో కత్రినా అంకితభావాన్ని మిచెల్ మెచ్చుకున్నారు. “కత్రినా వీలైనంత అందంగా ప్రొఫెషనల్‌గా ఉండేది. తన కదలికల్లో కచ్చితత్వం కోసం చాలా కష్టపడి పనిచేసింది. ఆమెకు కొరియోగ్రఫీలో అనుభవం ఉందని స్పష్టమైంది. కాబట్టి తనతో పని చేయడం చాలా సులభం. మేము అందరికీ చెమటలు పట్టించాము``అని మిచెల్ చెప్పారు. టవల్ ఫైట్ చిత్రీకరణ సమయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మిచెల్ మాట్లాడుతూ, ``ప్రధాన సవాళ్లలో ఒకటి ఖచ్చితంగా వార్డ్‌రోబ్! మా తువ్వాళ్లు సరైన స్థలంలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ చాలా వేగంగా కదలాలి.. పైగా ఫైట్ చేయాలి.. ఇది కచ్చితంగా సవాల్.. మేము కొన్ని పాయింట్ల వద్ద తువ్వాళ్లను క్లోజ్ చేసాం. అది మాకు చాలా సహాయపడింది`` అని తెలిపారు.
మరో సవాల్ ఏమిటంటే ప్రమాదకరంగా.. దూకుడుగా కనిపించేంత దగ్గరలో ఒకరినొకరు కొట్టుకోవడం.. అయితే ఒకరికొకరు ఎటువంటి గాయాలు కలిగించకుండా ఉండటానికి చాలా దూరంగా ఉన్నాం. లక్ష్యాన్ని సాధించడంలో నేను విజయం సాధించానా? అయితే, నేను ఒక ప్రొఫెషనల్.. కాబట్టి ప్రతిదీ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. మా ఇద్దరికీ దెబ్బలేవీ తగల్లేదు కాబట్టి మేము కెమెరా ఫుటేజీ కోసం సర్దుబాటు చేయాల్సి వచ్చింది.. అని మిచెల్ టవల్ ఫైట్ చత్రీకరణపై వివరించారు. `టైగర్ 3`కి మనీష్ శర్మ దర్శకత్వం వహించగా ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ దీపావళి కానుకగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.