హీరోయిన్ తో శ్రీనువైట్ల ఫీట్లే చేయించిన‌ట్లున్నాడు?

తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `విశ్వం` సినిమాలో హీరోయిన్ కావ్యాథాప‌ర్ పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Update: 2024-10-08 00:30 GMT

సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప‌డి ఉండ‌దు. చాలా వ‌ర‌కూ వాళ్ల పాత్ర‌లు తెర‌పై కనిపించి వెళ్లామా? లేదా? అన్న‌ట్లే ఉంటాయి. కొర‌టాల శివ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌కు అధికా ప్రాధా న్య‌త ఉంటుంది. తాజా సినిమా దేవ‌ర మిన‌హాయిస్తే గ‌త చిత్రాల్లో నాయిక‌ల‌కు మంచి ప్రాధాన్య‌త ఇచ్చారు. అలాగే శ్రీనువైట్ల కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌ల‌కు పెద పీట వేస్తుంటారు.

తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `విశ్వం` సినిమాలో హీరోయిన్ కావ్యాథాప‌ర్ పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏకంగా అమ్మ‌డిని ఔట్ పుట్ కోసం బాగానే ఇబ్బంది పెట్టిన‌ట్లు తెలుస్తోంది. వైట్ల ఆమెకి స‌వాల్ విసిరేక పాత్ర ఇచ్చిన‌ట్లు తెలుస్తొంది. రిలీజ్ నేప‌థ్యంలో కావ్యాథాప‌ర్ త‌న పాత్ర విష‌యాలు పంచుకుంది.` ఈ సినిమా షూటింగ్ ఇటలీ, మ‌నాలీ, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లాంటి చోట జ‌రిగింది.

కొన్నిసార్లు మైన‌స్ డిగ్రీల వాతావ‌ర‌ణంలో షూటింగ్ చేసాం. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ వెంట‌నే మ‌ళ్లీ అధిక ఉష్ణోగ్ర‌తల్లోనూ షూటింగ్ నిర్వ‌హించాం. అలా కూడా చాలా అసౌక‌ర్యంగా పీల‌య్యాం. కొన్నిసార్లు కొండ ప‌ర్వాతాలు ఎక్కాల్సి వ‌చ్చింది. ఇలా సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. షూటింగ్ స‌మ‌యంలో చాలా స‌వాల్ గా అనిపించింది. శారీర‌కంగా బాగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.

ఈ సినిమా చేసిన త‌ర్వాత నాకో న‌మ్మ‌కం క‌లిగింది. త‌దుప‌రి ఎలాంటి క‌ష్ట‌మైన పాత్ర అయినా ధైర్యంగా చేయోచ్చు అని అర్ద‌మైంది. ఈ సినిమా షూటింగ్ గొప్ప అనుభూతిని పంచింది` అని తెలిపింది. ఈ అమ్మ‌డు `డ‌బుల్ ఇస్మార్ట్` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించలేదు. `విశ్వం` అమ్మ‌డికి రెండ‌వ సినిమా.

Tags:    

Similar News