'ఇస్మార్ట్' పాప.. నాలుగోదైనా హిట్టిచ్చేనా?

ఇస్మార్ట్ పాప.. అంటే టక్కున గుర్తొచ్చేది నభా నటేష్.. ఆ సినిమాతోనే లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుదామని ట్రై చేస్తున్నారు

Update: 2024-10-11 14:48 GMT

ఇస్మార్ట్ పాప.. అంటే టక్కున గుర్తొచ్చేది నభా నటేష్.. ఆ సినిమాతోనే లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుదామని ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా డార్లింగ్ సినిమా చేసిన బ్యూటీ.. ఇప్పుడు స్వయంభూలో యాక్ట్ చేస్తున్నారు. అయితే మరో ఇస్మార్ట్ పాప కావ్య థాపర్ కూడా ఉంది కదా.. ఇటీవల రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన అందచందాలతో అలరించి మరో ఇస్మార్ట్ పాపగా మారిపోయారు.

అయితే మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇస్మార్ట్ పాప కావ్య థాపర్.. పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి ఫేమస్ బ్రాండ్లకు వర్క్ చేశారు. 2013లో హిందీ షార్ట్‌ ఫిల్మ్‌ తత్కాల్ తో యాక్టింగ్ కెరీర్ ను మొదలు పెట్టారు. ఆ సమయంలో అనేక యాడ్స్ లో కూడా కనిపించారు. ఆ తర్వాత ఈ మాయ పేరేమిటో మూవీతో 2018లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ నెక్స్ట్ ఇయరే కోలీవుడ్ లోకి మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాతో అడుగుపెట్టారు.

యంగ్ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఏక్ మినీ కథ మూవీ చేసిన కావ్య.. మంచి హిట్ అందుకున్నారు. తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు. ఆ తర్వాత ఏడాది మిడిల్‌ క్లాస్‌ లవ్‌ తో బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. గత ఏడాది విజయ్ సేతుపతి బిచ్చగాడు-2లో నటించిన కావ్య థాపర్.. 2024లో ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన మూవీలో నటించిన కావ్య థాపర్.. యావరేజ్ హిట్ అందుకున్నారు. ఆమె రోల్ కు సినిమాలో పెద్దగా స్కోప్ లేదని చెప్పాలి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ఈగల్ లో యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ తో మెప్పించినా హిట్ అందుకోలేకపోయారు. రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ లో కనిపించారు. తన లుక్స్ తో అలరించిన అమ్మడికి రిజల్ట్ విషయంలో మాత్రం నిరాశే మిగిలింది. అలా మూడు చిత్రాలు చేసినా హిట్ సాధించలేకపోయారు.

ఇప్పుడు దసరా కానుకగా విశ్వం మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు కావ్య థాపర్. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ఆ మూవీకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. సినిమాలో అందచందాలతో గ్లామరస్ గా సందడి చేశారు కావ్య. సాంగ్స్ లో అదరగొట్టేశారు. యాక్టింగ్ తో మెప్పించారు. మరి 2024లో నాలుగో సినిమాతో వచ్చిన కావ్య ఈసారైనా హిట్ అందుకుంటారేమో చూడాలి. దసరా సెలవులు కాబట్టి కంప్లీట్ అయ్యాకే తెలుస్తుంది!

Tags:    

Similar News