కీడా కోలా బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
అయితే ఈ చిత్రం ఓవర్సీస్లో 400 వరకు లోకేషన్స్‌లో రిలీజ్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్‌గానే రిలీజ్‌ను సొంతం చేసుకుంది
చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. నేడు(నవంబర్ 3) రిలీజైన ఈ చిత్రం బాగానే నవ్విస్తోంది. ప్రీమియర్స్‌కు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రం ఓవర్సీస్లో 400 వరకు లోకేషన్స్‌లో రిలీజ్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్‌గానే రిలీజ్‌ను సొంతం చేసుకుంది. ట్రేడ్ పరంగా కూడా మంచి బిజినెస్సే చేసుకుందని తెలిసింది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ రూ. 8.5 కోట్ల నుంచి రూ.9 కోట్ల దాకా ఉందని అంచనా.
ఈ లెక్కల పరంగా చూసుకుంటే.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్‌గా నిలవాలంటే ఓవరాల్‌గా రూ. 9.5 కోట్లకు పైగా షేర్‌ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్‌కు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి నార్మల్ షోలకు మంచి టాక్ దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో...
ఇక సినిమా రివ్యూ విషయానికొస్తే.. కామెడీ, రచన, నటుల యాక్టింగ్, సంగీతం ప్లస్‌గా నిలిచాయి. అయితే ఊహకు అందేలా కథనం సాగడం కాస్త మైనస్‌గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కీడాకోలా... నవ్వించే కీడా అని అంటున్నారు.
సినిమాకు పనిచేసినవారు.. సంగీతం - వివేక్ సాగర్; సినిమాటోగ్రఫీ - ఏజే అరోన్; ఎడిటింగ్ - ఉపేంద్ర వర్మ; నిర్మాత - కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందరాజ్, ఉపేంద్ర వర్మ ; సమర్పణ - రానా దగ్గుబాటి; రచన సహకారం - ప్రణయ్ కొప్పల, రమ్య కాకుమాను, సనాతన్ రాజ్.