ఓటీటీ అలెర్ట్.. కీడా కోలా గోల షురూ

స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం కీడా కోలా.. సినీప్రియులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2023-12-29 09:23 GMT

స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం కీడా కోలా.. సినీప్రియులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రం ఒక రోజు ముందే చూసే అవకాశం కూడా లభించింది.

క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం కావడంతో కీడా కోలా రిలీజ్ కు ముందు మంచి హైప్ వచ్చింది. అందుకు తగ్గట్లే ఈ సినిమా మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్‌ ను చేసుకుని థియేటర్లలో విడుదలైంది. కానీ సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ను చేరలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్‌ గానే మిగిలిపోయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.

క‌థేంటంటే?

వాస్తు (చైత‌న్య‌రావు), అత‌డి తాత వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం), లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌).. వీళ్ల ముగ్గురు టార్గెట్ డ‌బ్బు సంపాదించడ‌మే. తాత కోసం కొన్న కూల్ డ్రింక్ కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ను చూపించి షాప్ ఓనర్ ను బ్లాక్‌ మెయిల్ చేయాల‌ని ప్లాన్ వేస్తారు. రూ.5 కోట్ల నుంచి డీల్ స్టార్ట్ చేస్తారు.

మ‌రోవైపు జీవ‌న్ (జీవ‌న్‌)కు కార్పొరేట‌ర్ కావాల‌నేది కోరిక. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్నయ్య నాయుడు (తరుణ్ భాస్కర్) సపోర్ట్ తో ఆ ట్రయిల్స్ లో ఉంటాడు. కార్పొరేట‌ర్ కావాల‌న్నా జీవన్ కు కూడా డ‌బ్బే అవ‌స‌రం కావ‌డంతో అందుకోసం వీళ్లు కూడా ఓ ప్లాన్ వేస్తారు. మ‌రి వీళ్లందరి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? రెండు గ్యాంగ్ లు ఎలా క‌లిశారు? కోలాలో బొద్దింక ఎలా ప‌డింది? అనేదే మిగతా సినిమా.

పెళ్లిచూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాల్లో యువ‌త మ‌న‌స్త‌త్వాల్ని, వారి అల్ల‌రిత‌నాన్ని చూపించారు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఆ రెండు సినిమాల‌కు భిన్నంగా క్రైమ్ స్టోరీ లైన్ తో కీడా కోలా సినిమాను తెర‌కెక్కించారు. జోన‌ర్ మార్చిన త‌న‌కు మంచి ప‌ట్టున్న కామెడీని మాత్రం వీడ‌లేదు.

పేరుకు క్రైమ్ సినిమానే అయినా న‌వ్వించ‌డ‌మే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుని సినిమాను రూపొందించారు. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే నాయుడు పాత్ర‌లో కామెడీ టైమింగ్‌ తో మెప్పించారు. ఈ చిత్రాన్ని సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్‌లు సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Tags:    

Similar News