నుదిటిన వైష్ణవ నామంతో కీర్తి సురేష్ భర్త?
మహానటి కీర్తి సురేష్ ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు ఆంటోనీని అంగరంగ వైభవంగా పెళ్లాడింది.
మహానటి కీర్తి సురేష్ ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు ఆంటోనీని అంగరంగ వైభవంగా పెళ్లాడింది. ఆసక్తికరంగా ఈ పెళ్లిలో వరుడు రెండు విభిన్నమైన వేషధారణలతో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
అతడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ లో ట్రెడిషనల్ పట్టు వస్త్రాలను కట్టుకుని, నుదుటిన వైష్ణవ నామం (తిలక్) దిద్ది కనిపించాడు. మూడు రోజుల క్రితం జరిగిన పెళ్లి వేడుకలో అతడు ఇలా కనిపించాడు. ఇప్పుడు అందుకు భిన్నంగా క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ లో పోష్ అవతార్ తోను కనిపించాడు. కీర్తి- ఆంటోని దేశీ హిందూ సాంప్రదాయ విధానంలో పెళ్లి చేసుకున్న తరవాత ఇప్పుడు క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ ఫోటోల్లో అతడు భిన్నంగా కనిపించడం గమనార్హం. ఈ రెండు సాంప్రదాయాలకు తగ్గట్టుగానే ఆంటోని తన రూపాన్ని మార్చుకున్నారు. ఏది ఏమైనా ఇరు సాంప్రదాయాలను వధూవరులు గౌరవించి ఆనందమయ జీవనంలోకి అడుగుపెట్టినందుకు వారికి దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు అందాయి.
ఈ సెలబ్రిటీ వివాహానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కీర్తి సురేష్- ఆంటోనీ థాటిల్ డిసెంబర్ 12న వివాహం చేసుకున్నారు. గోవాలో తమిళ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో కానరీ పసుపు రంగు దుస్తులు ధరించి కీర్తి తన తండ్రి సురేష్ కుమార్ ఒడిలో కూర్చుంది. ఆంటోనీ ఒక తమిళ బ్రాహ్మణ వరుడిలా దుస్తులు ధరించి నుదుటిన తిలకంతో కనిపించాడు. ఈ వేడుకకు సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కీర్తి తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. ఆ రోజు సాయంత్రం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కూడా వేడుకలు జరిగాయి. ఇప్పుడు కీర్తి తన క్రిస్టియన్ వివాహ ఫోటోలను కూడా షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి.
నటి కీర్తి- ఆంటోని 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆంటోనీ ఇంజనీర్ గా పని చేసిన తర్వాత వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆంటోనీ కొచ్చిలో ఉన్న ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్ యజమాని. కీర్తి ప్రస్తుతం తమిళంలో `రివాల్వర్ రీటా` సహా రెండు సినిమాల్లో నటిస్తోంది. తాను నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం `బేబీ జాన్` తమిళ చిత్రం థెరికి బాలీవుడ్ రీమేక్. డిసెంబర్ 25 న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరో.