ఆర్కుట్ లో పరిచయం..రెస్టారెంట్ లో సైగలు!
కీర్తి సురేష్-అంటోనీ తట్టిల్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ జోడీ ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది.
కీర్తి సురేష్-అంటోనీ తట్టిల్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ జోడీ ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది. అలాగే కీర్తి సురేష్ యధావిధిగా నటిగా మళ్లీ బిజీ అయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఈ విషయంలో భర్త సహకారం ఎంతో ఉంది. సాధారణంగా పెళ్లైన తర్వాత నటిగా కొనసాగాలంటే బోలెడన్ని పరిమితులు దాటుకుని రావాలి.
కానీ కీర్తి విషయంలో తన తల్లిదండ్రుల నుంచిగానీ, భర్త నుంచి ఎలాంటి ఇబ్బందులు లేదు. దీంతో కీర్తి ధాంపత్య జీవితాన్ని...వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసి ముందుకెళ్తుంది. అయితే నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆంటోనీతో తన లవ్ గురించి మరికొన్ని విషయాలు పంచుకుంది. ఆంటోనీ తొలిసారి ఆర్కుట్ లో పరిచయం అయ్యాడుట. అప్పుడు కీర్తి ఇంటర్మీడియట్ చదవుతోందిట. మూడు నెలల తర్వాత మొదటి సారి ఓ రెస్టారెంట్ లో అతడిని చూసిందిట.
ఆ సమయంలోవెంట తల్లిదండ్రులు ఉన్నారుట. దీంతో కీర్తి అతడితో మాట్లాడలేకపోయిందిట. ఇద్దరు కేవలం కళ్లతోనే సైగలు చేసిందిట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆంటోనీ ప్రపోజ్ చేసాడుట. ఏ అనుబంధంలోనైనా అర్దం చేసుకోవడం, మద్దతిచ్చుకోవడం అన్నది ఇద్దరు బాగా తెలుసుకున్న అంశంగా తెలిపింది. ఇద్దరి మీద ఒకరిపై ఒకరికి నమ్మకం కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారుట.
ఇద్దరు దూరంగా ఉన్నా..మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉండేవట. కీర్తి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ట్రోలింగ్ బారిన పడటంతో అండగా నిలబడి ఆంటోనీ ధైర్యాన్ని అందించాడుట. ఈ విషయాలన్ని తల్లిదండ్రులకు తెలుసు కాబట్టే పెళ్లి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతగా జరిగిందని తెలిపింది.