సంక్రాంతి వేళ కీర్తి సురేష్ ముగ్గులేస్తుందా!
తాను ఎంత హీరోయిన్ అయితే మాత్రం ముగ్గులు వేయదు అనుకుంటే పొరబడినట్లే అంటోంది.
సంక్రాంతి పండుగ అంటే ముగ్గుల పండుగ. అన్ని లోగిళ్లు ముగ్గులతో రంగులమయం అవుతాయి. సంక్రాంతి పండుగ నెలు రోజుల ముందుగా ఈ హడావుడి మొదలవుతుంది. పండుగ దగ్గర పడుతుంది అనగా మరింత అందంగా వాకిళ్లు ముస్తాబవుతుంటాయి. ఈ విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తక్కువేం కాదండోయ్. తాను ఎంత హీరోయిన్ అయితే మాత్రం ముగ్గులు వేయదు అనుకుంటే పొరబడినట్లే అంటోంది. అవును ఈ విషయాలు అమ్మడు స్వయంగా తెలిపింది.
కీర్తి సంక్రాంతి ముచ్చట్లు ఏంటో? ఆమె మాటల్లోనే.. అమ్మ వల్ల నాకు భక్తి అలవాటైందిట. కొత్త సంవ్సతరం తొలినాళ్లలో వచ్చే మొదటి పండుగకు ఇంట్లో ఉండటం అలవాటు. ఆ రోజు గ్యాడ్జెట్లకు చాలా దూరంగా ఉంటుందిట. పండుగ రోజు అక్కతో కలిసి ఇంటిని అరటి ఆకులు..చెరుకు గడలు.. పూల రంగులతో తప్పక అలంకరిస్తారుట. ఆరు బయట రాళ్లతో పోయ్యిని ఏర్పాటు చేసి పెద్ద మట్టి కుండలో పాలు పొంగిస్తారుట.
ఆ ప్రసాదాన్ని బంధువల ఇళ్లకు వెళ్లి పంచుతారుట. లేదంటే అందర్నీ ఇంటికి ఆహ్వానించి స్వర్గస్తులైన వారిని స్మరించుకుంటామంది. తెలుగు సినిమాలు చేయడం వల్ల తెలుగింట సంప్రదాయ ప్రభావం కూడా ఎక్కువగా పడింది అంటోంది. ఈ మధ్య కొత్తగా ముగ్గులు వేయడం కూడా ప్రారంభించిందిట. ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేస్తోందిట కొన్ని రోజులుగా. ఇది తెలుగు సంప్రదాయం.
సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి తెలుగు లోగిళ్లలో ఈ రకమైన హడావుడి కనిపిస్తుంది. కీర్తి కొంత కాలంగా తెలుగు సినిమాలు చేయడంతో ఇక్కడ పద్దతులకు బాగా అలవాటు పడినట్లు ఉంది. తెలుగు నటీనటులతోనూ ఆమె ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుంది. తెలుగు నటి కాకకపోయినా తెలుగమ్మాయిలా ఎంతో చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఇక్కడ పద్దతుల గురించి ఎంతో చక్కాగా వివరిస్తుంది.