అత‌డి ప్రేమలేఖ కీర్తి సురేష్ గుండెల్లోనే!

నిత్యం సోష‌ల్ మీడియా కీర్తి ఫోటో క‌నిపించిదంటే? ఆ క్రింద ప్ర‌పోజ‌ల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-02-11 12:04 GMT
అత‌డి ప్రేమలేఖ కీర్తి సురేష్ గుండెల్లోనే!
  • whatsapp icon

కీర్తి సురేష్ అలియాస్ మ‌హాన‌టి కి బోయ్స్ లో ఉన్న‌ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కీర్తి చలాకీతనం..డీసెన్సీ అమ్మ‌డికి భారీ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. సాధార‌ణంగా ఈ రేంజ్ ఫాలోయింగ్ హా*ట్ బ్యూటీల‌కు క‌నిపిస్తుంది. కానీ కీర్తి బ్యూటీ ముందు! వాళ్లెంతా ఎంత‌? అంటారు కుర్ర‌కారు. నిత్యం సోష‌ల్ మీడియా కీర్తి ఫోటో క‌నిపించిదంటే? ఆ క్రింద ప్ర‌పోజ‌ల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

వేల‌ల్లో ప్ర‌పోజ‌ల్స్ ఉంటాయి. ర‌క‌ర‌కాలగా ప్ర‌పోజ్ చేసి త‌మ ప్రేమ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇవ‌న్నీ ప్ర‌తీ న‌టి నిత్యం చూస్తూనే ఉంటుంది. మ‌రి కీర్తి కెరీర్ లో డిఫ‌రెంట్ ప్ర‌పోజ‌ల్ అంటూ ఏదైనా ఉందా? ఉంద‌నే తెలుస్తోంది. ఆ విష‌యాన్ని కీర్తి సురేష్ స్వ‌యంగా రివీల్ చేయ‌డం విశేషం. `కొన్నాళ్ల క్రితం నేను న‌టి అయిన త‌ర్వాత ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి వెళ్లాను. అప్ప‌టికే నేను వ‌స్తున్నాను అన్న సంగ‌తి తెలిసి అక్క‌డ‌కి భారీగా జ‌నం చేరుకున్నాను.

ఇంత‌లో ఆ గుంపులో నుంచి ఓఅబ్బాయి ముందుకు దూసుకొచ్చాడు. వ‌స్తూనే అత‌డు నా చేతిలో ఓ పెద్ద పుస్త‌కం పెట్టాడు. ఆ స‌మ‌యంలో న‌న్ను ఎలాంటి అసౌక‌ర్యానికి గురి చేయ‌లేదు. వ‌చ్చాడు..చేతిలో పుస్త‌కం పెట్టి వెంట‌నే అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు. అ పుస్త‌కంలో నాకు సంబంధించిన ఫోటోల‌తో పాటు ఓ ఉత్త‌రం కూడా ఉంది. త‌న‌ని పెళ్లి చేసుకోమ‌ని ఆ అబ్బాయి రాసిన ప్రేమ లేఖ చూసాను. అందులో త‌న వివ‌రాలు అన్ని ఉన్నాయి.

అబ్బాయి ఫోటో..ఇంటి అడ్ర‌స్..ఫోన్ నెంబ‌ర్ అన్నీ ఉన్నాయి. ఆలెట‌ర్ మొత్తం చ‌దివాక షాక్ అయ్యాను. ఆ త‌ర్వాత కాసేప‌టికి న‌వ్వుకున్నాను. మొద‌టి ప్రేమ‌లేఖ కావ‌డంతో ఆ లెట‌ర్ ఇప్ప‌టికీ నా ద‌గ్గ‌ర భ‌ద్రంగా దాచుకున్నాను. ఎందుకంటే చ‌దువుకుంటున్న‌ప్పుడు ఒక్క‌రూ కూడా నాకు ప్రేమ లేఖ‌లు రాయ‌లేదు. నా జీవితంలో చూసిన తొలి ల‌వ్ లెట‌ర్ అదే కావ‌డంతో నాకెంతో స్పెష‌ల్ ఆ లెట‌ర్` అని తెలిపింది.

Tags:    

Similar News