KGF - సలార్.. ఆమ్లెట్ తిప్పేసిన నీల్?
కానీ నిన్న విడుదలైన ట్రైలర్ పై మాత్రం విభిన్న తరహాలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ సినిమాతో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోబోతున్నాడు అనే విధంగా ఫ్యాన్స్ నుంచి అయితే మంచి కామెంట్స్ వచ్చాయి. కానీ నిన్న విడుదలైన ట్రైలర్ పై మాత్రం విభిన్న తరహాలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ ట్రైలర్ అయితే అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదని, నీల్ KGF ఆమ్లెట్ ను తిప్పేసి సలార్ మసాలా కలిపాడు అనేలా కూడా కామెంట్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాకు కేజిఎఫ్ కు లింక్ ఉంటుందేమో అని మొదట చాలా రకాల గాసిప్స్ వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని డైరెక్ట్ గానే దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఇది పూర్తిగా మరొక ప్రపంచంలో నడిచే కదా అని వివరణ ఇవ్వడంతో సలార్ ఎలా ఉంటుందో అని అనుకున్నారు. అయితే ఈ సినిమా కేజిఎఫ్ కు పెద్దగా లింకు లేకపోయినప్పటికీ దాదాపు అక్కడ ఉన్న వాతావరణం ఇందులోను కనిపిస్తోందని ట్రైలర్ తో అర్థమైంది.
అంతేకాకుండా క్యారెక్టర్లు ఎలివేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కేజిఎఫ్ తరహా షేడ్స్ కనిపిస్తూ ఉండడం మైనస్ గా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు తన మార్కుకు తగ్గట్టుగా డార్క్ తరహా యాక్షన్ హైలెట్ చేయబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఇందులో కేజిఎఫ్ లో ఎలాగైతే హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుందో ఇప్పుడు సలార్ లో కూడా ప్రభాస్ దేవా క్యారెక్టర్ ను హైలెట్ చేశారు. అక్కడ అమ్మ కోరిక కోసం అయితే ఇక్కడ స్నేహితుడి కోసం ఎంత దూరమైనా వెళ్లే హీరోగా చూపించారు.
అంతేకాకుండా ఊర్వశి పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ కేజిఎఫ్ 2 లో హైలెట్ అయింది. ఇక ఇప్పుడు సలార్ లో కూడా ఆమె పాత్ర దాదాపు అదే తరహాలో ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. కేజిఎఫ్ సామ్రాజ్యంకు తగ్గట్టుగానే సలార్ ఖాన్ సార్ అనే ఒక సామ్రాజ్యాన్ని హైలెట్ చేశారు. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా దాదాపు కేజిఎఫ్ కు మ్యాచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కేజిఎఫ్ లో ఉన్న చాలా మంది నటీనటులు సలార్ లో కూడా ఉండడం తో ఆ తరహా అభిప్రాయాలు అయితే వస్తున్నాయి.
ఇక ఫైనల్ గా అగ్రస్థానం కోసం పోటీ పడుతూ ఒకరిని మించిన మరొక విలన్ కూడా ఇందులో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఏది ఏమైనాప్పటికీ KGF తరహాలో లింక్స్ ఉండడం సినిమాపై కొంత ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. అసలే ప్రభాస్ సక్సెస్ లేక సతమతమవుతున్న తరుణంలో ఈ తరహా నెగెటివిటీ పాయింట్స్ ఫ్యాన్స్ కంగారు పెడుతోంది. మరి దర్శకుడు ప్రశాంత్ మొత్తం సినిమాతో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.