తమ్ముడు కోసం కేజీఎఫ్ నే దించారా!
ఈ యాక్షన్ సన్నివేశాల్ని కేజీఎఫ్ స్టంట్ మాస్టర్ విక్రమ్ మోర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో నితిన్ తో పాటు కీలక తారాగణమంతా పాల్గొంటుందని తెలుస్తోంది.
యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో `తమ్ముడు` సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ టైటిల్ తో రావడంతో అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో ప్రారంభం కానుంది. ఇది భారీ యాక్షన్ షెడ్యూల్. ప్రొడక్షన్ డిజైనర్ మునిశేఖర్ సారథ్యంలో ప్రత్యేకమైన సెట్ ని రూపొందించారు.ఈ యాక్షన్ సన్నివేశాన్ని వారం రోజుల పాటు చిత్రీకరించనున్నారుట.
సినిమాలో ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ యాక్షన్ సన్నివేశాల్ని కేజీఎఫ్ స్టంట్ మాస్టర్ విక్రమ్ మోర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో నితిన్ తో పాటు కీలక తారాగణమంతా పాల్గొంటుందని తెలుస్తోంది. కేజీఎఫ్ స్టంట్ మాస్టర్నే సీన్ లోకి తెచ్చారంటే? యాక్షన్ సన్నివేశాల్లోనూ క్రియేటివిటీ ఉంటుందని చెప్పొచ్చు. రొటీన్ యాక్షన్ సన్నివేశాలకు భిన్నంగా ఇవి ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన ఫైట్లు బాగా వచ్చాయని ధృమా వ్యక్తం చేస్తున్నారు.
తమ్మడు-అక్క అనుబంధంచుట్టూ తిరిగే స్టోరీ ఇది. కానీ వినూత్నంగా ఆవిష్కరించబోతున్నారు. సిస్టర్ సెంటిమెంట్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయని..తమ్ముడి-అక్కడ సెంటిమెంట్‌ని సైతం సినిమాలో హైలైట్ చేయబోతున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు సిస్టర్ సెంటిమెంట్ ప్రధాన కారణమని ఇప్పటికే రివీల్ అయింది. తాజా యాక్షన్ ఎపిసోడ్ కూడా దానికి సంబంధించిన కంటున్యూటీ పార్ట్ లా ఉంది. సిస్టర్ పాత్రలో ఓ సీనియర్ నటి నటిస్తుందని సమాచారం తప్ప! ఆమె ఎవరు? అన్నది ఇంతవరకూ రివీల్ చేయలేదు.
ఈ సినిమాతో హిట్ కూడా అంతే కీలకం దర్శక-హీరోలకి. `భీష్మ` తర్వాత నితిన్ చేసిన సినిమాలేవి సరైన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. అలాగే వకీల్ సాబ్ హిట్ అని ప్రచారం తప్ప ఆ తర్వాత వేణు శ్రీరామ్ కి దర్శకుడిగా అవకాశాలు రాలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అవకాశం ఇది. కాబట్టి ఇద్దరు సక్సెస్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. హిట్ కోసం అంతే కసిగా పనిచేస్తున్నారు.