'ఖల్ నాయక్' ఛాన్స్ జస్ట్ మిస్ అయిన స్టార్ ఇతను!
అయితే వాస్తవానికి ఆ పాత్ర పోషించాల్సింది సంజయ్ దత్ కాదుట. ముందుగా ఆ పాత్రని అనీల్ కపూర్ కి అనుకున్నట్లు దర్శకుడు సుభాష్ ఘాయ్ తెలిపారు.
1993లో రిలీజ్ అయిన 'ఖల్ నాయక్' అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన సినిమా ఇది. 'చోళీ కే పీచే క్యాహై' పాట దేశమంతా ఓరేంజ్ లో మారు మ్రోగింది. సంజయ్ దత్ సినీ కెరీర్ లోనే మైలు రాయిలా నిలిచిన చిత్రమిది. దత్ హెయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. అదే తరహా హెయిర్ స్టైల్ అప్పటి యువత అనుసరించేది. పోడవైన జుట్టు..కోర మీసాలు గెడ్డం తో ఆలుక్ స్టైల్ వేరుగా ఉండేది.
అయితే వాస్తవానికి ఆ పాత్ర పోషించాల్సింది సంజయ్ దత్ కాదుట. ముందుగా ఆ పాత్రని అనీల్ కపూర్ కి అనుకున్నట్లు దర్శకుడు సుభాష్ ఘాయ్ తెలిపారు. ఖల్ నాయక్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను అనగానే చాలా మంది హీరోలు నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు సన్నిహితంగా ఉండే అనీల్ కపూర్ కూడా సంప్రదిం చాడు. స్టోరీ సహా అన్ని నచ్చడంతో తానే నటిస్తానని పట్టు బట్టాడు.
పాత్ర స్వభావానికి అనుగుణంగా జుట్టు పెంచడానికి ..గుండు చేయించుకోవడానికి అన్నింటికి సిద్దపడ్డాడు. మొదట్లో నేను కూడా అనీల్ కి ఒకే చెబుతాం అనుకున్నా. కానీ ఇందులో హీరోది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఒకసారి అమాయకంగా..ఒకసారి భయంకరంగా కనిపించే ముఖం కావాలి. దానికి సంజయ్ దత్ అయితేనే సరిగ్గా సరిపోతాడని చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నా' అన్నారు.
అలా అనీల్ కపూర్ నటించాల్సి ఖల్ నాయక్ పాత్రని సంజయ్ దత్ తన్నుకుపోయాడు. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. వాటికి వాళ్లే న్యాయం చేయగలరు. అలాంటి పాత్ర ఖల్ నాయక్ లో సంజయ్ దత్. డిఫరెంట్ షెడ్స్ లో సంజయ్ దత్ నటన..ఆహార్యం ఆ సినిమాకి ఎంతో గొప్పగా కుదిరింది. అందుకే సినిమా అంత పెద్ద విజయం సాధించింది. నేటికి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నా మంటే అందుకు దత్ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.