ఆ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కన్పమ్ చేసిన డైరెక్టర్
ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూయర్ ఖల్ నాయక్-2 గెస్ చేయోచ్చా? అని ప్రశ్నించగా.. 'కథ పై కూర్చున్నాం అంటూ రివీల్ చేసారు.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఖల్ నాయక్' సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అదో ట్రెండ్ సెట్టర్ మూవీ. సంజయ్ దత్..మాధురీ దీక్షిత్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రమది. అందులో ఇద్దరి పాత్రలు ఆకట్టుకున్న వైనం..జాకీ ష్రాప్ కీ రోల్ సినిమాని అంత పెద్ద హిట్ చేసాయి. ఈ చిత్రానికి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించగా.. ముక్తా ఆర్స్ట్ నిర్మించింది. ఈ సినిమా రిలీజ్ అయి మూడు దశాబ్ధాలు పూర్తవుతుంది.
ఈ సందర్బంగా ఓ మీడియా సంస్థకి దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూయర్ ఖల్ నాయక్-2 గెస్ చేయోచ్చా? అని ప్రశ్నించగా.. 'కథ పై కూర్చున్నాం అంటూ రివీల్ చేసారు. 'పకడ్భందీగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే శుభవార్త వింటారు అంటూ బధులిచ్చారు. దీంతో ఆ మ్యాటర్ నెట్టింట వైరల్ అయింది. సుభాష్ నుంచి ఇలాంటి సమాధానం ఏమాత్రం ఊహించనది. 30 ఏళ్ల క్రితం ఖల్ నాయక్ సీక్వెల్ ఎలా ఉంటుందని? కొంత మంది భావించారు.
కానీ దర్శకుడు అందరి అంచనాలు తారుమారు చేసారు. ఖల్ నాయక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మరి అప్పటి ఖల్ నాయక్ పాత్రల్లో సంజయ్ దత్..మాధురీ దీక్షిత్ నటించారు. ఇప్పుడు సీక్వెల్ లో ఆ పాత్రలు ఎవరు పోషిస్తారు? అన్నది ఆసక్తికరం. బాలీవుడ్ లో కొత్త తరం నటులెంతో మంది ఉన్నారు. కొంత మంది వారసులు కొనసాగుతుండగా..బయట నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
మరి సుభాష్ ఘాయ్ ఎవరికి అవకాశం ఇస్తారు? అన్నది చూడాలి. సుభాయ్ ఘాయ్ కి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 2015 లో 'హీరో 'సినిమా తర్వాత గతేడాది '36 ఫార్మ్' హౌస్ కి పనిచేసారు. అదీ నిర్మాతగా. ఆయన చివరిగా 2014 'ది అన్ బ్రేక్ బుల్' అనే సినిమా కి దర్శకుడిగా పనిచేసారు. ఆ తర్వాత నిర్మాతగానే కొనసాగారు. తాజాగా 'ఖల్ నాయక్ 'సీక్వెల్ తో ముందుకు రావడం విశేషం.