సినిమా హిట్‌కు ఫార్ములా అదే: ఖుషి క‌పూర్

ప్ర‌స్తుతం ఖుషి న‌టించిన ల‌వ్ యాపా సినిమా ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఖుషి చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది.

Update: 2025-02-05 09:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి న‌ట వార‌సురాలిగా ఖుషి క‌పూర్ ఇప్ప‌టికే సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ది ఆర్చీస్ సినిమాతో కెరీర్ ను మొద‌లుపెట్టిన‌ ఖుషి క‌పూర్ ఆ సినిమాతో ఫ్లాప్ ను అందుకుంది. ప్ర‌స్తుతం ఖుషి న‌టించిన ల‌వ్ యాపా సినిమా ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఖుషి చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది.

ల‌వ్ యాపా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఖుషి ఏ సినిమాకైనా ప‌బ్లిసిటీ చాలా ముఖ్య‌మని, మ‌నం దేన్నైనా ఆడియ‌న్స్ వ‌ర‌కు తీసుకెళ్తేనే వారు ఆద‌రిస్తార‌ని, అలా కాకుండా సినిమా తీశాం చూస్తారులే అనుకుంటే కుద‌ర‌ద‌ని ఈ సంద‌ర్భంగా ఖుషి తెలిపింది. ల‌వ్ యాపా సినిమా అంద‌రి కంటే యూత్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంద‌ని, క‌చ్ఛితంగా ఈ సినిమాను యూత్ మొత్తం ఆద‌రిస్తార‌ని ఖుషి భావిస్తోంది.

16 ఏళ్ల లోపు వ‌య‌సున్న ప్ర‌తీ ఒక్క‌రికీ ల‌వ్ యాపా నచ్చుతుంద‌ని ఖుషి ఈ సంద‌ర్భంగా తెలిపింది. అయినా మ‌నం చేసిన సినిమా ప్ర‌తీ ఒక్క‌రికీ న‌చ్చేలా తీయ‌లేమ‌ని, త‌న మొద‌టి సినిమా ది ఆర్చీస్ సినిమాకీ, ఇప్ప‌టికీ తాను చాలా డెవ‌ల‌ప్ అవ‌డంతో పాటూ చాలా నేర్చుకున్నాన‌ని, స్టోరీ సెలెక్ష‌న్ విష‌యంలో కూడా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నట్టు ఖుషి వెల్ల‌డించింది.

ల‌వ్ యాపా సినిమా ఓటీటీలో కాకుండా థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతుండ‌టం వ‌ల్ల కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు ఖుషి తెలిపింది. ట్రైల‌ర్ రిలీజ్ టైమ్ లో బిగ్ స్క్రీన్ పై త‌న‌ను తాను చూసుకున్న‌ప్పుడు ఒణికిపోయాన‌ని, కానీ అలా చూసుకుని ఎంతో ఆనంద‌ప‌డ్డాన‌ని ఖుషి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది. సినిమా స‌క్సెస్ అనేది క‌లెక్ష‌న్స్ పై ఉంటుంది కాబ‌ట్టి ఆ క‌లెక్ష‌న్స్ రావడానికి త‌న వంతు కృషి చేస్తాన‌ని ఖుషి ఈ సంద‌ర్భంగా చెప్పింది.

ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టించిన ల‌వ్ యాపా సినిమాకు అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమా లవ్ టుడే సినిమాకు రీమేక్ గా ల‌వ్ యాపా రూపొందింది. ఖుషి క‌పూర్ ఈ సినిమా విజ‌యంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

Tags:    

Similar News