థై థండ‌ర్ షో కోసం కియ‌రా పాట్లు

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Update: 2024-12-13 00:30 GMT

కియారా అద్వానీ మోస్ట్ అవైటెడ్ 2025 మూవీ గేమ్ ఛేంజ‌ర్ లో న‌టిస్తోంది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. స‌లార్‌- క‌ల్కి 2898 ఏడి- దేవ‌ర‌- పుష్ప 2 .. వంటి భారీ చిత్రాలు వ‌రుస‌గా పాన్ ఇండియా హిట్లు సాధించ‌గా, ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ సాధించాల‌ని రామ్ చ‌ర‌ణ్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.

ఇలాంటి కీల‌క మూవీలో కియ‌రా ల‌క్కీ ఛాన్స్ అందుకుంది. సంక్రాంతి బ‌రిలో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కి రానుండ‌గా, కియ‌రా ఇప్ప‌టికే ప్ర‌చారం కానిచ్చేస్తోంది. ప‌నిలో ప‌నిగా కియ‌రా సోష‌ల్ మీడియాల్లోను బిజీ బిజీగా ఉంది. తాజాగా హార్పర్స్ బజార్ ఇండియా డిసెంబర్ 2024 క‌వ‌ర్ షూట్‌లో పాల్గొంది. కియారా మైఖేల్ కోర్స్ ఫాల్ వింటర్ 2024 కలెక్షన్ నుండి డిజైన‌ర్ దుస్తులు ధ‌రించి కియ‌రా ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇందులో ఫుల్ స్లీవ్‌లు, ఓపెన్ ఫ్రంట్ భారీ సిల్హౌట్, ఎంబ్రాయిడరీ బ్రాలెట్, హై-వెయిస్ట్ బికినీ బాటమ్స్‌లో అందంగా క‌నిపించింది. ఫోటోషూట్ ఆద్యంతం కియ‌రా థై స్లిట్ ఎలివేష‌న్ ప్ర‌ధానంగా హైలైట్ అయింది.

అయితే కియ‌రా లేటెస్ట్ ఫోటోషూట్ చూశాక త‌న ఫంకీ హెయిర్ స్టైల్ త‌న లుక్ ని పూర్తిగా మార్చేసింద‌ని వ్యాఖ్యానించారు. కొంద‌రు అభిమానులు త‌మ ఫేవ‌రెట్ ని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయామ‌ని, క‌న్ఫ్యూజ్ అయ్యామ‌ని కూడా కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు అభిమానులు ఈ ఫోటోషూట్ ని దీపిక ప‌దుకొనే గ‌త ఫోటోషూట్ తో పోలి ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో కియ‌రా న‌టిస్తోంది. త‌దుప‌రి హృతిక్ రోషన్- ఎన్టీఆర్ న‌టిస్తున్న‌ వార్ 2లోను న‌టిస్తోంది. YRF గూఢచారి విశ్వంలో కియ‌రా మొద‌టి సారి న‌టిస్తోంది.

Tags:    

Similar News