రెడ్ హాట్ లో కియారా కవ్వింపు కాక పుట్టిచేలా!
తాజాగా అమ్మడు మరో బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో హోయలు పోయింది.
వతరం భామా మణుల్లో కియారా అద్వాణీ ఫ్యాషన్ సెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ వరల్డ్ లో తానెంతో అడ్వాన్స్ అని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ చేసిది. ఇండస్ట్రీకొచ్చిన అనతి కాలంలో కేన్స్ వేడుకల్లో సైతం మెరిసి బ్యూటీగా రికార్డు దక్కించుకుంది. మరెన్నో అంతర్జాతీయ వేదికలపైనా కియారా మెరిసింది. నిరంతరం తనలో ఐకానిక్ గాళ్ ని హైలైట్ చేస్తుంటుంది. తాజాగా అమ్మడు మరో బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో హోయలు పోయింది.
డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. రెండ్ కలర్ ఔట్ ఫిట్ లో చూపరులను ఆకర్షించింది. నెక్ టూ థై వరకూ ధరించిన ఔట్ ఫిట్ కియారాని మరింత అందంగా ఆవిష్కరించింది. చేతి మణికట్టు వద్ద పువ్వు డిజైన్ డ్రెస్ కి మరింత బ్యూటీని జోడించింది. డ్రెస్ మ్యాచింగ్ ఎరుపు రంగు లిప్ స్టిక్ పెదాలకు పూసింది. మ్యాకప్ తో కియారా ఫేస్ మరింత ప్రకాశవంతంగా మారింది. కాళ్లకు రెడ్ కలర్ హైహీల్స్ ధరించింది.
సొగసరి అలా వాక్ చేస్తూ వివిధ భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారా యి. కియారా స్టన్నింగ్ ఫోజులకు యువత ఫిదా అవుతుంది. పోస్టులతో ప్రశంసలు...ప్రపోజల్స్ గుప్పిస్తున్నారు. ఇక కియారా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ లో దూసుకుపోతుంది. త్వరలో `గేమ్ ఛేంజర్` సినిమాతో సందడి చేయనుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరిలో ఆ చిత్రం రిలీజ్ అవుతుంది. కియారా తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో? సక్సెస్ అయితే గుర్తింపు అదే స్థాయిలో దక్కుతోంది. మరోవైపు బాలీవుడ్ లో `వార్ -2` లో నటిస్తోంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోందని సమాచారం.