గేమ్ ఛేంజర్.. 'కియారా' కెవ్వు కేక!

ప్రామిసింగ్‌ యాక్ట్రెస్‌ గా సక్సెస్‌ ఫుల్‌ సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ కియారా అడ్వాణీకి సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే

Update: 2024-07-31 06:21 GMT

ప్రామిసింగ్‌ యాక్ట్రెస్‌ గా సక్సెస్‌ ఫుల్‌ సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ కియారా అడ్వాణీకి సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ఫగ్లీ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ నేను మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అటు హిందీ.. ఇటు తెలుగులో బిజీ బిజీగా గడుపుతోంది. మ్యారేజ్ అయ్యాక వచ్చిన అవకాశాలు అన్నీ అందుకుని ప్రాజెక్టులపై సైన్ చేస్తోంది కియారా.

గత ఏడాది సత్యప్రేమ్ కి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కియారా.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2లో నటిస్తోంది. ఇక సౌత్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో యాక్ట్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సలార్ సీక్వెల్ లో నటించనుందట. స్పెషల్ సాంగ్ తోపాటు కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

అయితే నేడు కియారా బర్త్ డే. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో గేమ్ ఛేంజర్ మేకర్స్.. కియారాకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. "గేమ్‌ ఛేంజర్ టీమ్ తరఫున జాబిలమ్మ కియారా అడ్వాణీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె వైబ్రంట్ ఎనర్జీ త్వరలో మీ హృదయాలను మంత్రముగ్ధులను చేస్తుంది" అని ట్వీట్ చేశారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే పోస్టర్ లో శంకర్ మార్క్ క్లారిటీగా కనిపిస్తుందనే చెప్పాలి.

క్రేజీ లెహంగా వేసుకున్న కియారా చాలా అందంగా కనిపిస్తోంది. డ్రెస్సింగ్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ లోని విజువల్స్.. సూపర్ గా ఉన్నాయి. ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ అయిన జరగండి సాంగ్ లోని స్టిల్ నే మేకర్స్ విడుదల చేశారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కొన్ని రోజుల క్రితమే మేకర్స్ రిలీజ్ చేసిన జరగండి పాట.. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా.. ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఇప్పుడు అంతా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని అంతా భావించినా.. ఇటీవల దిల్ రాజు క్రిస్మస్ కు కలుద్దామంటూ హింట్ ఇచ్చారు. దీంతో డిసెంబర్ 25వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల అవ్వనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ తన పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. కొద్ది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. అయితే సౌత్ లో సత్తా చాటాలనుకుంటున్న కియారా ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News