డైరెక్టర్లకి కియారా కండీషన్ ఇది!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్..బాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఛాన్సులందుకుంటూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్..బాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఛాన్సులందుకుంటూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `గేమ్ ఛేంజర్` లో నటిస్తుంది. హిందీలో `సత్యప్రేమ్ కి కథ` లో నటిస్తోంది. ఈ రెండు గాక కొత్త అవకాశాలు క్యూలో ఉన్నాయి. బాలీవుడ్ `వార్-2` చిత్రంలోనూ ఈ భామని తీసుకునే ప్లాన్ లో ఉంది యూనిట్. అయితే హృతిక్ కి జోడీగానా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పెయిర్ గానా? అన్నది క్లారిటీ రావాలి.
ఇంకా పలు హిందీ ప్రాజెక్ట్ లకు అమ్మడు కమిట్ అవ్వాల్సి ఉందిట. తెలుగులో ఓ బడా బ్యానర్లో భారీ ఆఫర్ వరించినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా కొత్త అవకాశాలతో అమ్మడు కొంగొత్తగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మడు భవిష్యత్ ని ప్లానింగ్ ని రివీల్ చేసి షాక్ ఇచ్చింది. కెరీర్ పరంగా తనకంటూ కొన్ని నియమ నిబంధనలున్నాయని వాటిని చూత తప్పకుండా పాటిస్తానంటోంది. `స్టోరీ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైనా నటిస్తా.
అయితే ఆ కథనాకు కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ కాని కథలకు సంతకం చేయను. అందులో ఎంత పెద్ద హీరో ఉన్నా సరే వాటిని తిరస్కరిస్తాను. విజయాలు వెంట ఉన్నాయని మురిసిపోను. ఆ మత్తులో ఏ సినిమా పడితే ఆ సినిమాకి సంతకం చేయను. అలాగని నేను చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి అని కాదు. కొన్ని ప్లాప్ అయ్యాయి. ఎవరూ ప్లాప్ కథల్ని ఎంచుకోరు. కానీ కొన్ని వేళలో అలా జరిగిపోతుంది.
దానికి ఎవరూ బాధ్యులు కారు. సక్సెస్ వచ్చినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. నచ్చని కథల్లో దర్శకులు ఎంత ఫోర్స్ చేసినా నటించను. ఇది నా కండీషన్. నా వద్దకు వచ్చి కథలు వినిపించాలంటే వీటిని పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అభిమానులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి` అని అంది.