అంబానీ వెడ్డింగ్‌: న‌ల్ల గౌనులో కియ‌రా వ‌న్నె చిన్నెలు

సాయంత్రం వేళ క‌ళ్లు జిగేల్మ‌నే లుక్ తో ఈ వేదిక వ‌ద్ద‌కు కియ‌రా విచ్చేసింది. కియ‌రా డే 1 ప్రీవెడ్డింగ్ ఉత్సవాల ఫస్ట్ లుక్ లను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా దూసుకెళ్లింది.

Update: 2024-03-02 03:51 GMT

వ‌ర‌ల్డ్ రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముఖేష్ అంబానీ పుత్ర‌ర‌త్నం అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లి సంద‌డితో ముంబై క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈ వేడుక కోసం విదేశాల నుంచి పాపుల‌ర్ పాప్ సింగ‌ర్స్ విచ్చేయ‌గా, బాలీవుడ్ ప్ర‌ముఖ‌ల త‌ళుకుబెళుకులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

 

ఇప్పుడు కియ‌రా వంతు. ఇంతకుముందే కియారా తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జామ్‌నగర్‌కు చేరుకుంది. పెళ్లి వేదిక వ‌ద్ద‌ ఈ బ్యూటీ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ గుబులు పుట్టించింది. కియారా అల్బినా డైలా రోజెస్ లైన్ నుండి అద్భుతమైన బృందంతో వేడుకకు హాజరయ్యారు. సాయంత్రం వేళ క‌ళ్లు జిగేల్మ‌నే లుక్ తో ఈ వేదిక వ‌ద్ద‌కు కియ‌రా విచ్చేసింది. కియ‌రా డే 1 ప్రీవెడ్డింగ్ ఉత్సవాల ఫస్ట్ లుక్ లను షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా దూసుకెళ్లింది.

 

అందమైన నలుపు రంగు బాడీకాన్ దుస్తులు ధరించిన‌ కియారా బోల్డ్ అండ్ డీప్ నెక్‌లైన్ లుక్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. ఈ డిజైన‌ర్ దుస్తుల‌కు కుడి భుజంపై చిన్న పువ్వుతో ప్ర‌త్యేక‌ ఆకృతిని సెట్ చేయ‌డం అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. కోహ్ల్ షీర్ లైట్ హైలైటర్ కియ‌రా అందాన్ని మ‌రింత పెంచింద‌ని చెప్పాలి. కియారా తెల్లని స్టోన్డ్ ఇయర్ కఫ్‌లు వెద‌ర్ కి గాంభీర్య‌త‌ను పెంచాయి. ప్రఖ్యాత లక్ష్మీ లెహర్ స్టైలింగ్ చేసిన ఈ లుక్ మ‌తులు చెడ‌గొట్టింది. వేదిక వ‌ద్ద చూప‌రుల క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ట్రీట్ ఇది.

 

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్ వంటి ప్రముఖులు హాజరవడంతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ప్ర‌త్యేక శోభ సంత‌రించుకున్నాయి. పెళ్లి ఈవెంట్‌పై చాలా ఉత్కంఠ నెలకొంది. ఒక సరికొత్త థీమ్, డ్రెస్ కోడ్‌తో ప్రతిరోజూ అతిథులు క‌నిపిస్తున్నారు.

 

Tags:    

Similar News