వైజాగ్ లో కింగ్ డమ్ !
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియాలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల 'కింగ్ డమ్' అనే టైటిల్ ప్రకటనతోనే అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియాలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల 'కింగ్ డమ్' అనే టైటిల్ ప్రకటనతోనే అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. అప్పటి వరకూ సినిమాపై పెద్దగా బజ్ లేదు టీజర్, టైటిల్ రిలీజ్ తో ఇద్దరు భారీ ఎత్తునే ప్లాన్ చేసారి తేలిపోయింది. 'కింగ్ డమ్' టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసింది.
వెండి తెరపై మరో సరికొత్త విజయ్ ని ప్రజెంట్ చేస్తున్నాడని అర్దమవుతుంది. టీజర్ లో కొన్ని సినిమాల కలగలిపినట్లు అనిపించినా బజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. టీజర్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. అక్కడే కింగ్ డమ్ సక్సెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ విశాఖపట్టణంలో ప్లాన్ చేస్తున్నారు.
విశాఖ సహా సమీప ప్రాంతాల ఎగ్జోటిక్ లొకేషన్లలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది క్లైమాక్స్ షెడ్యూల్ అని సమాచారం. దాదాపు 20 రోజుల పాటు వైజాగ్ లోనే నిరవధికంగా షూటింగ్ నిర్వహిస్తారని తెలిసింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సీక్వెన్స్ మరికొన్ని విశాఖలో చిత్రీకరించనున్నారుట. ఇప్పటికే విజయ్ దేవరకొండ వైజాగ్ చేరుకున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచి షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు .
దీనికి సంబంధించి అధికారికంగా విషయం వెల్లడికావాల్సింది. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిందంటున్నారు. విశాఖ షెడ్యూల్ తో దాదాపు ముగింపు దశలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి గౌతమ్ అండ్ కో పెద్దగా అప్ డేట్స్ ఏమీ అందించని సంగతి తెలిసిందే. మొదటి భాగం `కింగ్ డమ్` మేలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.