కింగ్ ఆఫ్ కోతా.. మ‌రో పాన్ ఇండియా స్టార్ కి అంకురార్ప‌ణ‌?

తాజా స‌మాచారం మేర‌కు కేర‌ళ‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోను అత్యంత భారీగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌న్న‌ది కింగ్ ఆఫ్ కోథా బృందం యోచిస్తోంది.

Update: 2023-08-04 04:43 GMT
కింగ్ ఆఫ్ కోతా.. మ‌రో పాన్ ఇండియా స్టార్ కి అంకురార్ప‌ణ‌?
  • whatsapp icon

ఓకే బంగారం- సీతారామం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో టాలీవుడ్ లోను దుల్క‌ర్ స‌ల్మాన్ అసాధార‌ణ మార్కెట్ ను అందుకున్నాడు. మాలీవుడ్ నుంచి మోహ‌న్ లాల్- మ‌మ్ముట్టి వంటి స్టార్ల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో ఫాలోయింగ్ ఉంది. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో పృథ్వీరాజ్ సుకుమార‌న్.. ఫ‌హ‌ద్ ఫాజిల్ వంటి వారికి టాలీవుడ్ లో ప్రాధాన్య‌త పెరిగింది.

కానీ నేటి జ‌న‌రేష‌న్ నుంచి ఎవ‌రు అంత ప్ర‌భావ‌వంత‌మైన మాలీవుడ్ స్టార్? అని ప్ర‌శ్నిస్తే .. దుల్క‌ర్ స‌ల్మాన్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అత‌డు ఇటీవ‌ల నెమ్మ‌దిగా టాలీవుడ్ పైనా గ్రిప్ పెంచుకున్నాడు. మార్కెట్ ఉన్న హీరోగా పాపుల‌ర‌య్యాడు. మునుముందు కోలీవుడ్- శాండ‌ల్వుడ్- బాలీవుడ్ లోను గ్రిప్ పెంచుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

ప్ర‌స్తుతం దుల్కర్ 'కింగ్ ఆఫ్ కోతా' సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్లో స‌త్తా చాటుతాన‌ని న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఈ సినిమాని భార‌త‌దేశంలో అత్యంత భారీగా విడుద‌ల చేయాలేది దుల్క‌ర్ టీమ్ ప్లాన్. కేవ‌లం కేర‌ళ‌లోనే 500+ స్క్రీన్ ల‌లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే 7 AM ఫస్ట్ షోతో కేరళలో ఘ‌నంగా ప్రారంభం కానుంది. తాజా స‌మాచారం మేర‌కు కేర‌ళ‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోను అత్యంత భారీగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌న్న‌ది కింగ్ ఆఫ్ కోథా బృందం యోచిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లు విడుదలకు మూడు వారాల ముందే కేర‌ళ‌లో ప్రారంభమయ్యాయి. విడుదల రోజున కేరళలోని మెజారిటీ థియేటర్లలో KOK మొదటి షో ఉదయం 7 గంటలకు షెడ్యూల్ అవుతుంది.

KOK 500 థియేటర్లకు పైగా స్క్రీన్ లో రిలీజ‌వుతున్నందున‌ ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన మొదటి రోజు వసూళ్లను సాధిస్తుందని అంచ‌నా. ఇంతకుముందు మేకర్స్ ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ -కలపక్కారా..ను రిలీజ్ చేసారు. ఇది ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటుంది.

ఈ పాటను శ్రేయా ఘోషల్, బెన్నీ దయాల్, జేక్స్ బిజోయ్ పాడారు. ప్రముఖ దర్శకుడు జోషి తనయుడు అభిలాష్ జోషి ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాల‌ని ఎంతో క‌సితో ఈ సినిమాని తెర‌కెక్కించారు. 'కింగ్ ఆఫ్ కోత‌' పూర్తి యాక్షన్ చిత్రంగా ప్ర‌చారంలో ఉంది. ఈ చిత్రంలో షమ్మి తిలకన్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్ జోస్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News