పండగ రేసులో అబ్బవరం “క”

దీంతో ఈ రిలీజ్ డేట్ ని దీపావళికి వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2024-10-10 12:30 GMT

కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న మూవీ 'క'. ఈ సినిమాతో సుజిత్, సందీప్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో 'క' మూవీ కథని దర్శకులు చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఇప్పటికే ఈ మూవీ థీయాట్రికల్ బిజినెస్ క్లోజ్ అయిపొయింది. వంశీ నందపాటి ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేశారు. అన్ని భాషలలో మంచి ధరకి ఈ మూవీ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మలయాళంలో ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ పై రిలీజ్ చేయబోతూ ఉండటం విశేషం. రీసెంట్ గా ఈ మూవీ నుంచి జాతర వీడియో సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. సామ్ సి.ఎస్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత మైలేజ్ తీసుకొచ్చేలా ఉంది.

ఇదిలా ఉంటే 'క' చిత్రాన్ని అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉందంట. దీంతో ఈ రిలీజ్ డేట్ ని దీపావళికి వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీపావళి కనుకగా శివకార్తికేయన్, సాయి పల్లవి జోడీగా నటించిన తమిళ్ మూవీ అమరన్ రిలీజ్ కాబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లక్కీ భాస్కర్ కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వీటికి పోటీగా ఇప్పుడు కిరణ్ అబ్బవరం తన పాన్ ఇండియా మూవీ 'క' ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ మాత్రం రిలీజ్ పై అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒక వేళ దీపావళి రేసులో కిరణ్ అబ్బవరం ఉంటే మాత్రం కచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కిరణ్ అబ్బవరం కూడా 'క' సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం తన ఇమేజ్ ని మార్చేస్తుందని బలంగా విశ్వసిస్తున్నాడు. ఈ సినిమాలో నయన సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటించారు. కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' సినిమాతో చివరిగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని 'క' తో సక్సెస్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.

Tags:    

Similar News