కిరణ్ అబ్బవరం స్కూల్ లవ్ స్టోరీ లీక్!

దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన వారు.. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

Update: 2024-10-29 23:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. హీరోయిన్ రహస్య గోరఖ్ తో కొన్ని నెలల క్రితం ఏడడుగులు నడిచారు. క‌ర్ణాట‌క కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌ లో ఇరువురి కుటుంబ‌స‌భ్యులు, కొద్దిమంది స‌న్నిహితుల మధ్య కిరణ్, రహస్య వివాహం ఘనంగా జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన వారు.. వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ర‌హ‌స్య గోర‌ఖ్ 2019లో రిలీజ్ అయిన రాజాగారు రాణివారు సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. షూటింగ్ మొదటి రోజే రహస్యతో కిరణ్ ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత సీక్రెట్ గా లవ్ ట్రాక్ ను నడిపించారు. అయితే ఇప్పుడు కిరణ్ అబ్బవరం చిన్నప్పటి లవ్ స్టోరీని ఓ నెటిజన్ పోస్ట్ రూపంలో లీక్ చేశారు! దీంతో కిరణ్ ఫైర్ ఇమోజీలు రిప్లైగా పెట్టారు. అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం తన 'క' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం.. నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. వాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సమయంలో కొంచెం స్కూల్ ఫ్రెండ్స్‌ ను గుర్తు చేసుకో.. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అంటూ ఓ ఫిమేల్ యూజర్ ట్వీట్ చేశారు. దీంతో హాయ్ శరణ్య.. నీవు ఇంకా మారలేదు అని కిరణ్ అబ్బవరం రిప్లై ఇచ్చారు.

ఇప్పటికీ అంతే కోపంగా ఉన్నావని, త్వరలోనే మనమంతా కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కిరణ్ ట్వీట్ కు మరో నెటిజన్ స్పందించారు. నేను కూడా నీ క్లాస్ మేట్ నే అన్నా.. నువ్వు స్కూల్ లో దివ్యకు లైన్ వేయడం ప్రిన్సిపాల్ మేడమ్ కు చెప్పింది నేనే అని పోస్ట్ చేశారు. దీంతో చెప్పింది నువ్వే అని అప్పుడే తెలిసి ఉంటేనా.. అంటూ ఫైర్ ఎమోజీలను యాడ్ చేస్తూ కిరణ్ రిప్లై ఇచ్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా జరిగింది.

త్వరలో మనమంతా కలుద్దామని కిరణ్ చెప్పిన శరణ్య.. స్కూల్ లో దివ్యకు లైన్ వేశావంటూ నెటిజన్ పోస్ట్ పై స్పందించారు. అసలు తమ స్కూల్‌ కు లేడీ ప్రిన్సిపల్ కాదు కదా అని పోస్ట్ చేశారు. దీంతో కిరణ్ కు స్కూల్ లవ్ స్టోరీ ఉందో లేదో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కామెడీగా పెట్టారేమో అని అంటున్నారు. మొత్తానికి కిరణ్ స్కూల్ ఫ్రెండ్స్ మంచి హంగామా చేశారు.

Tags:    

Similar News