బాబు అబ్బవరం.. ఇప్పటికైనా మించిపోయింది లేదు..
ఇదే ఏడాది వచ్చిన మీటర్ సినిమా అయితే మరింత దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఈ శుక్రవారం వచ్చిన రూల్స్ రంజాన్ తో అతనికి మరొక షాక్ తగిలింది.
కొత్తగా వచ్చే కుర్ర హీరోలు ఇటీవల కాలంలో చాలా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ పాయింట్స్ టచ్ చేయకుండా ఏదో ఒక కొత్త కథను ఆడియోన్స్ అందించాలని తపన వారిలో కనిపిస్తోంది. ఉదాహరణకు నవీన్ పోలిశెట్టి చేసింది రెండు మూడు సినిమాలు అయినా ఎంతగా ఇంపాక్ట్ చూపించాడో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు.
ఇక నిఖిల్ సిద్ధార్థ కూడా ప్రతి కథలోను కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మొదట్లోనే కాస్త మంచి గుర్తింపును అందుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. పెద్దగా సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ కుర్ర హీరో మొదట్లోనే రాజావారు రాణి గారు అంటూ బాక్సాఫీస్ వద్ద ఒక మంచి సక్సెస్ అయితే సొంతం చేసుకున్నాడు.
ఇక తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం కూడా కరోనా టైంలోనే మంచి కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఆ తర్వాత అతను కథలో ఎంచుకున్న విధానం మాత్రం ఫామ్ కోల్పోయేలా చేసింది. సెబాస్టియన్ మరింత డిజాస్టర్ కాగా ఆ తర్వాత సమ్మతమే పరవాలేదు అనిపించింది. ఇక 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' వినరో భాగ్యము విష్ణు కథ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇదే ఏడాది వచ్చిన మీటర్ సినిమా అయితే మరింత దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఈ శుక్రవారం వచ్చిన రూల్స్ రంజాన్ తో అతనికి మరొక షాక్ తగిలింది. గతంలోనే కిరణ్ తనను ఓ బ్యాచ్ టార్గెట్ చేస్తుంది అని కావాలని తన సినిమాలపై ట్రోలింగ్ చేస్తున్నారు అన్నట్లుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ తరహా ట్రోల్స్ అనేది ప్రతి హీరోకు తప్పనిదే.
అగ్ర హీరోలు సైతం ప్రతి సినిమాకు ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. కానీ వారు అవేమీ పట్టించుకోకుండా నెక్స్ట్ సినిమాతో ఎలా సెట్ అవ్వాలి అనే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ కిరణ్ లాంటి కొందరు హీరోలు ఆ విషయంలో కాస్త ఉన్నతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి డిఫరెంట్ కంటెంట్ గురించి ఫోకస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.
అతను రెగ్యులర్ పాయింట్స్ కు భిన్నంగా ట్రై చేస్తే ఆడియన్స్ ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడున్న రోజుల్లో చిన్న హీరోలకు ప్రయోగాలే ప్రధాన ఆయుధం. కాబట్టి గత సినిమాల రిజల్ట్ అనేది నెక్స్ట్ సినిమా కంటెంట్ మీద ఏమాత్రం ప్రభావం చూపదు. కానీ మొదట వచ్చే పోస్టర్ నుంచి ట్రైలర్ దాకా ఎంత కొత్తగా ఆకట్టుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ట్రోల్స్ పై అలాగే రెగ్యులర్ కంటెంట్ మీద కాకుండా కిరణ్ కాస్త కొత్తగా ట్రై చేస్తే మళ్లీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.