వరుణ్ తేజ్.. కొడితే దీంతోనే కొట్టాలి
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేయబోయే సినిమా విషయంలో చాలా కేర్ తీసుకొని ఇంటరెస్టింగ్ స్టోరీలైన్ తీసుకున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత చేస్తోన్న మూవీ మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి దర్శకుడు సిద్ధమయ్యారు. వరుణ్ తేజ్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మాస్ కథతో మెప్పించిన మూవీ అంటే గద్దలకొండ గణేష్ మాత్రమే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చి ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మధ్య వచ్చిన గాండీవదారి అర్జున డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేయబోయే సినిమా విషయంలో చాలా కేర్ తీసుకొని ఇంటరెస్టింగ్ స్టోరీలైన్ తీసుకున్నారు. వైజాగ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథని దర్శకుడు కరుణ కుమార్ రాసుకున్నారు.
దీనికోసం 1950, 1980 మధ్య కాలంలో పరిసరాల్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ తీరంలో ఈ కాలంలో ఎలాంటి వాతావరణం ఉండేదో దానిని స్టూడియోలోనే సెట్ వర్క్ తో డిజైన్ చేశారు. తాజాగా మూవీ షూటింగ్ ఈ సెట్స్ లోనే స్టార్ట్ అయ్యింది. ఈ మూవీలో నాలుగు విభిన్న వయస్సులలో వరుణ్ తేజ్ పాత్ర ఉంటుందంట. ఇప్పటి వరకు అతని కెరియర్ లో చేయనటువంటి కొత్త కథాంశంతో మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.
అందుకే వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. గద్దలకొండ గణేష్ తరహాలోనే డిఫరెంట్ లుక్ లో కనిపించే ప్రయత్నం చేయబోతున్నారు. మూవీలో వరుణ్ తేజ్ కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వైరా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మిస్తోంది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ ను కోల్పోతున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఈ సినిమా అతని కెరీర్ కు చాలా ఇంపార్టెంట్. కొడితే దీంతోనే బిగ్ హిట్ కొట్టాలి. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల తర్వాత కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాపైన వరుణ్ తేజ్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.