నాపై రాజకీయం చేస్తున్నారు..నేనేంటో ప్రజలకు తెలుసు!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నెట్టింట ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే.
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నెట్టింట ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇన్ స్టా గ్రామ్ లో తమిళ భాషలో ఇలా రాసుకొచ్చారు. `నా మాటల్ని తప్పుగా అర్దం చేసుకుంటున్నారు. తప్పుడుగా ప్రచారం చేసి రాజకీయం చేస్తున్నారు. నా సినిమాల గమనాన్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. మహిళల పట్ల నాకెంతో గౌరవంఉంది.
నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేసాను. ఎప్పుడూ ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించింది లేదు. త్రిషని మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడాను. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకమైంది. కానీ నేను చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి తప్పుగా చూపించారు. వాటినే త్రిష చూసింది. అవే వివాదాస్పదంగా మారాయి. నేనేంటో..నా నిజ స్వరూపం ఏంటి? అన్నది తమిళ ప్రజలకు తెలుసు. సమాజంలో నా సేవలు ఎన్నో ఉన్నాయి.
వాటిని అలాగే కొనసాగిస్తాను. నా పట్ల విమర్శలు..ట్రోలింగ్ జరిగింది. వాళ్లంతా సమాజంలో చోటుచేసుకునే ముఖ్యమైన విషయాల పట్ల దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా` అన్నారు. మరి ఈ వివరణ పై త్రిష స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి. `లియో` సినిమాలో త్రిష..మన్సూర్ అలీఖన్ నటించిన సంగతి తెలిసిందే. మన్సూర్ అలీఖాన్ గతంలో చాలా చిత్రాల్లో ఆత్యాచార సన్నివేశాల్లో నటించానని...త్రిషతో అలాంటి సన్నివేశం లేనందుకు చాలా బాధపడుతున్నట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సహా సెలబ్రిటీలంతా మన్సూర్ అలీఖాన్ పై మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ అతని పై నెటి జనులు నిప్పులు చెరిగారు. అలాగే త్రిష కూడా మన్సూర్ అలీఖాన్ పై అదే తీరున అగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా మన్సూర్ అలీఖాన్ వివరణ ఎంత వరకూ సమంజసం అన్నది త్రిష నిర్ణయించాల్సి ఉంది.