ఆ హీరో ఇక తెలుగు సినిమాలు చేయడా..?
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు ఆడియన్స్ కి కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది.
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు ఆడియన్స్ కి కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. కెరీర్ తొలినాళ్లలోనే అతను బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు సిద్ధార్థ్ కి ఎంతో క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ క్రేజ్ తో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే దశాబ్ద కాలంగా ఎందుకో సిద్ధార్థ్ తెలుగు సినిమాలు చేయడం మానేశాడు. తన దగ్గరకు ఒక్క కథ రాలేదని చెప్పాడు సిద్ధార్థ్.
అయితే ఎవరో అవకాశం ఇవ్వడం కాదు తనకు తానే అవకాశాన్ని కల్పించుకోవాలని నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా తన ప్రొడక్షన్ లో చిన్నా సినిమా చేశాడు సిద్ధార్థ్. చిన్నారులపై లైంగిక దాడుల మీద ఈ సినిమా కథా నేపథ్యం సాగుతుంది. అయితే ఈ సినిమా కథ కథనాలు అన్ని బాగా కుదిరాయి. కానీ తెలుగులో అరడజను సినిమాలకు పైగా రిలీజ్ అవడంతో సిద్ధార్థ్ చిన్నా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు.
సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ కామన్ ఆడియన్స్ కి అది రీచ్ అవ్వలేదు. సిద్ధార్థ్ చిన్నా ప్రమోషన్స్ లో ఈ సినిమా నచ్చకపోతే తెలుగులో తను సినిమాలు చేయనని ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. చిన్నా రిజల్ట్ చూశాక సిద్ధార్థ్ తెలుగులో సినిమాలు కొనసాగిస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు స్టార్ క్రేజ్ తో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సిద్ధార్థ్ చిన్నా మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు కానీ అది నిరాశ పరిచింది.
చిన్నా తమిళ వెర్షన్ చిత్తా సినిమా అక్కడ హిట్ అయ్యింది. చిన్నా తెలుగు వెర్షన్ వారం ముందే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా థియేటర్ల సమస్య వల్ల రిలీజ్ కుదరలేదు. అందుకే వారం తర్వాత తెలుగులో రిలీజైంది అయినా కూడా హిట్ అందుకోలేదు. కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. కానీ చిన్నా సినిమాను ఎందుకో ఎంకరేజ్ చేయలేకపోయారు. మరి ఈ సినిమా ఫలితం సిద్ధార్థ్ లో మార్పు తెస్తుందా లేదా అన్నది చూడాలి. అసలే తన మార్కెట్ ఘోరంగా దెబ్బ తిన్న సిద్ధార్థ్ ఇటు సైడ్ రానంటూ చాలెంజ్ చేయడం కూడా రిస్క్ అని చెప్పొచ్చు. సిద్ధార్థ్ చిన్నా ప్రయత్నం మంచిదే కానీ ఫలితం మాత్రం సిద్ధార్థ్ ని నిరాశపరిచింది. లాస్ట్ ఇయర్ మహాసముద్రం చేసిన సిద్ధార్థ్ తెలుగు నుంచి తనకు అవకాశాలు రాలేదని చెప్పాడు. మరి ఇక మీదట సిద్ధార్థ్ కు తెలుగు నుంచి అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి.