ఆ నలుగురు14 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్ చేస్తారా?
ఒకప్పుడు సౌత్ హీరోల మధ్య పోటీ పీక్స్ లో ఉండేది. స్టార్ హీరోల చిత్రాలన్నీ ఒకేసీజన్ పట్టుబట్టి మరీ రిలీజ్ చేసేవారు
ఒకప్పుడు సౌత్ హీరోల మధ్య పోటీ పీక్స్ లో ఉండేది. స్టార్ హీరోల చిత్రాలన్నీ ఒకేసీజన్ పట్టుబట్టి మరీ రిలీజ్ చేసేవారు. తెలుగు..తమిళ్ లో ఈ పోటీ అత్యధికంగా కనిపించేది. అయితే కాలక్రమంలో అందులో ఎన్నో మార్పులొచ్చాయి. పోటీ పడి రిలీజ్ చేసుకుని నష్టాల భారం మోయడం కంటే నిర్మాత శ్రేయస్సు ముఖ్యమని భావించిన నేపథ్యంలో రిలీజ్ ఆర్డర్ లో చాలా రకాల మార్పులొచ్చాయి. హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం బిల్డ్ అయింది.
అందులోనూ గత పదేళ్లగా మరింత హెల్దీ వాతావరణంలోనే స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. అయితే తాజాగా 2010 సన్నివేశాన్ని మళ్లీ 14 ఏళ్ల తర్వాత రజనీకాంత్..కమల్ హాసన్..విజయ్...అజిత్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2010 లో రజనీకాంత్ 'ఎందిరన్'(రోబో) - కమల్ హాసన్ నటించిన 'మన్మదన్ అంబు'(మన్మధుని బాణం)- విజయ్ నటించిన 'సుర' - తల అజిత్ హీరోగా నటించిన ' అసల్' అన్నీ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో విడుదలయ్యాయి. ఆ నలుగురు నటించిన సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అవ్వడం అదే తొలిసారి.
ఆ తర్వాత మళ్లీ అలాంటి సన్నివేశం చోటు చేసుకోలేదు. తాజాగా 2024 అందుకు వేదిక అయింది. కమల్ హాసన్ నటిస్తోన్న 'ఇండియన్-2' జూన్ లో.. అలాగే విజయ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సెప్టెంబర్ లో..తల అజిత్ నటిస్తోన్న యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'విదా ముయార్చి'.. రజనీకాంత్ 'వేట్టైయన్' ఒకే ఏడాదిలో రిలీజ్ అవ్వడం విశేషం. వీటి రిలీజ్ తేదీలు ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. నెలలు మారుతున్నాయి తప్ప! రిలీజ్ మాత్రం ఒకే ఏడాది కావడంతో అభిమానుల ఆనందానికి అవదుల్లేవ్.
2010 లో రిలీజ్ అయిన ఆ నలుగురు సినిమాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఆ సన్నివేశం రిపీట్ అవ్వడంతో తాజా రిలీజ్ లు భారీ విజయాలు నమోదు చేస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అన్ని సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి. బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసే చిత్రాలే. మరి ఆర్డర్ లో ఏ హీరో ముందుంటాడు? ఎవరు వెనుకుంటారో చూడాలి.