అనిరుద్ లేకుండా కోలీవుడ్ సినిమా సౌండ్ చేయదా?

కోలీవుడ్ స్టార్ హీరోలు చేస్తోన్న పాన్ ఇండియా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇతర భాషలలో కూడా హైప్ తీసుకొని వస్తున్నాడు.

Update: 2024-04-18 04:57 GMT

కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోన్న పేరు అనిరుద్ రవిచందర్. తమిళ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా అనిరుద్ దూసుకుపోతున్నాడు. మేగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలకి ఇతనే మ్యూజిక్ అందిస్తూ ఉండటం విశేషం. రెహమాన్ లాంటి స్టార్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న కూడా దర్శకులు అనిరుద్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతను అందుబాటులో లేకపోతే జీవీ ప్రకాష్ కుమార్ ని సెకండ్ ఛాయస్ గా తీసుకుంటున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరోలు చేస్తోన్న పాన్ ఇండియా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇతర భాషలలో కూడా హైప్ తీసుకొని వస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్, దళపతి లియో సినిమాలు రిలీజ్ కి ముందే మంచి హైప్ క్రియేట్ చేశాయంటే దానికి కారణం అనిరుద్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అలాగే ఆ సినిమాల టీజర్, ట్రైలర్స్ లో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అనిరుద్ ఇచ్చి సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేశాడు.

ఈ కారణంగా సినిమాలకి తెలుగు, హిందీ భాషలలో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్ లో కూడా అనిరుద్ మ్యూజిక్ కారణంగా సక్సెస్ అందుకున్నాయి. అనిరుద్ మ్యూజిక్ లేకుండా వస్తోన్న పాన్ ఇండియా సినిమాలు మాత్రం అస్సలు బజ్ క్రియేట్ చేయడం లేదు. అవి రిలీజ్ కాబోతున్నాయి అనే విషయం కూడా ప్రేక్షకులకి తెలియకపోవడం విశేషం.

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ చేసిన లాల్ సలామ్ సినిమా మీద అస్సలు హైప్ క్రియేట్ కాలేదు. రజినీకాంత్ కెరియర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఆ విషయం కూడా మెజారిటీ ఆడియన్స్ కి తెలియదు. అనిరుద్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి నెక్స్ట్ లెవల్ హైప్ వచ్చేదనే మాట వినిపిస్తోంది.

అలాగే విజయ్ GOAT మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సాంగ్ కంపోజ్ చేశారు. అయితే ఈ సాంగ్ మూవీకి చెప్పుకోదగ్గ హైప్ తీసుకురాలేదని తెలుస్తోంది. తెలుగులో ఈ సాంగ్ పై ఎలాంటి ఫోకస్ లేదు. దీనిని బట్టి అనిరుద్ మ్యూజిక్ అయితేనే తమిళ్ స్టార్ హీరోల చిత్రాలకి ఇతర భాషలలో హైప్ తీసుకురాగలడనే ప్రచారం ఇప్పుడునడుస్తోంది.

తమిళ హీరో సూర్య కంగువా సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. మరి అతను మిగతా భాషల్లో ఆ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. ఇక అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా దేవర సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మరో లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలి అంటే అనిరుధ్ తోనే సాధ్యం. చూడాలి మరి ఆ సినిమా మ్యూజిక్ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News