ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలొచ్చే అప్డేట్

ఇదిలా ఉంటే 'దేవర 2' పైన కొరటాల శివ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ నా లైఫ్ లోనే హై లెవల్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసినట్లు చెప్పారు.

Update: 2024-10-08 04:55 GMT

'దేవర' సినిమాకి పబ్లిక్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే రేంజ్ సక్సెస్ ని కొరటాల ఇచ్చేలా కనిపిస్తున్నాడు. లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది చెప్పలేం కాని దసరా హాలిడేస్ ని మాత్రం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటుంది. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చిన కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. 10 రోజుల్లోనే ఏకంగా 466 కోట్ల కలెక్షన్స్ ని 'దేవర' మూవీ వసూళ్లు చేసిందని మేకర్స్ ప్రకటించారు.

'దేవర 2' మూవీ మొదటి సినిమాకి రెట్టింపు కలెక్షన్స్ వసూళ్లు చేయడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే 'దేవర' మూవీ సక్సెస్ మీట్ ని మేకర్స్ నిర్వహించారు. కొరటాల శివ కూడా ఈ సినిమాకి వస్తోన్న ఆదరణపై చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత వరకు ఎన్ని సక్సెస్ లు చూసిన 'దేవర' మాత్రం నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పారు. దీనిని బట్టి ఈ సినిమాపై కొరటాల శివ ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే 'దేవర 2' పైన కొరటాల శివ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ నా లైఫ్ లోనే హై లెవల్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసినట్లు చెప్పారు. అలాగే 'దేవర' కంటే పెద్దగా మరింత పవర్ ఫుల్ యాక్షన్ ఎలివేషన్స్ సన్నివేశాలతో 'దేవర 2' ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు చూసింది 10 శాతం స్టొరీ మాత్రమే. మిగిలిన 90 శాతం కథ 'దేవర పార్ట్ 2' ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

కొరటాల శివ మొదటి పార్ట్ లో క్యారెక్టర్స్, స్టొరీ వరల్డ్ బిల్డింగ్ వరకు మాత్రమే చెప్పారనే మాట వినిపిస్తోంది. దేవర 2లోనే అసలైన కథని, ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ అన్ని కూడా పెట్టి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో పార్ట్ 2పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దేవర 1 సినిమాపై కొరటాల క్రియేట్ చేసిన హైప్ కారణంగా ఆడియన్స్ భారీగా ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని కొరటాల రీచ్ కాలేకపోయాడనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దేవర క్యారెక్టర్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు 'దేవర 2' పైన కూడా కొరటాల శివ ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా పెంచేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే అప్పుడే వెయ్యి కోట్ల కలెక్షన్స్ లెక్కలేసుకుంటున్నారు. మరి పార్ట్ 2తో కొరటాల శివ అంచనాలని అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాదిలో 'దేవర 2' పెండింగ్ షూట్ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News