అందరికి బెస్ట్ ఇచ్చిన కొరటాల.. ఆ పుణ్యమే కాపాడాలి..

రచయితగా కెరియర్ స్టార్ట్ చేసి దర్శకులుగా మారిన వారు ఎక్కువ సక్సెస్ రేట్ కలిగి ఉంటారనే మాట ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తోంది.

Update: 2024-09-12 03:51 GMT

రచయితగా కెరియర్ స్టార్ట్ చేసి దర్శకులుగా మారిన వారు ఎక్కువ సక్సెస్ రేట్ కలిగి ఉంటారనే మాట ఇండస్ట్రీలో ఎక్కువ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ జాబితా చూసుకుంటే చాలా మంది రచయితలుగా కెరియర్ మొదలు పెట్టి దర్శకులు అయినవారే కనిపిస్తారు. అలాగే రచయిత నుంచి దర్శకుడిగా మారిన వ్యక్తి కొరటాల శివ. ఆయన డైరెక్టర్ గా మొదటి సినిమా మిర్చితోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు.

బాహుబలి కంటే ముందు డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా మిర్చి మూవీ నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొరటాల శివ శ్రీమంతుడు మూవీ చేశాడు. ఈ సినిమాతో మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు. తరువాత జూనియర్ ఎన్టీఆర్ కి తో జనతా గ్యారేజ్ తో సూపర్ సక్సెస్ ఇచ్చాడు.

ఇది ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. మరల సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేశారు. ఈ సినిమా శ్రీమంతుడు మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రాజకీయాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి భరత్ అనే నేను సినిమా చేసిన కొరటాల ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని విజయాన్ని మహేష్ బాబుకి ఇచ్చాడు.

తరువాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆచార్య మూవీ చేశారు. వరుస నాలుగు హిట్స్ తో ఆచార్య చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మూవీ చిరంజీవి కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. అదే సమయంలో మెగాహీరోల కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కొరటాల ఇమేజ్ ని కొంతవరకు డిస్టర్బ్ చేసింది.

అయితే రెట్టించిన ఉత్సాహంతో కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర మూవీ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నలుగురు హీరోలకి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన పుణ్యమే ఇప్పుడు దేవర విషయంలో కొరటాల ఇమేజ్, క్రెడిబిలిటీని కాపాడాలనే మాట వినిపిస్తోంది. అది ఎంత వరకు సాధ్యమవుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News