భారీ పారితోషికాలతో షాకిస్తోన్న నయా హీరోలు!
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సినీ ప్రేక్షకుడికి స్టార్ తో సంబంధం లేకుండా సినిమాల్ని ఆస్వాది స్తున్నారు.
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సినీ ప్రేక్షకుడికి స్టార్ తో సంబంధం లేకుండా సినిమాల్ని ఆస్వాది స్తున్నారు. కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేకుండా ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. డే బై డే ఓటీటీ వినియోగం అంతకంతకు పెరగడంతో నటీనటులు స్థాయి ఒక భాషకే పరిమితం అవ్వడం లేదు. ప్రపంచ భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. వాళ్ల పేర్లను సైతం గుర్తు పెట్టుకునే స్థాయికి ఓటీటీ చేర్చింది.
దీనిలో భాగంగా కొరియన్, చైనీస్, రష్యన్ అన్ని భాషల చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆయాభాషల హీరోలు భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. అలా 2024లో అత్యధిక పారితోషికం అందుకుంటుంది వీరే. `క్వీన్ ఆఫ్ టియర్స్` తో కొరియన్ నటుడు కిమ్ సూ హ్యాస్. ఇతడికి ఇప్పటికే మంచి పేరుంది. హ్యాంకూక్ ఇల్బో నివేధిక ప్రకారం కిమ్ ఒక్కో సినిమాకి 300 మిలియన్ డాలర్లు ఛార్జ్ చేస్తున్నాడు. అంటే ఒక్కో ఎపిసోడ్ కు 1.81 కోట్లు. మొత్తం 16 ఎపిసోడ్లకు 30 కోట్లు అందుకున్నట్లు లెక్కలో తేలింది.
అలాగే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన మరో వెబ్ సిరీస్ `స్క్విడ్ గేమ్`. ఈ సిరీస్ ద్వారా నెట్ ప్లిక్స్ భారీ ఆదాయం వచ్చింది. ఇందులో కీలక పాత్రలో లీ జంగ్ జే నటనతో అదరగొట్టాడు. తొలి సీజన్ కి 2 కోట్లు అందుకోగా, రెండో సీజన్ కు ఎపిసోడ్ కి 1 మిలియన్ డాలర్లు ఛార్జ్ చేస్తున్నాడు. కొరియన్ డ్రామాల్లో మంచి రేటింగ్ ఉన్న సీరిస్ ల్లో నటించాడు జూంగ్ కి. అతడు నటించిన రిబోర్న్ రిచ్ మంచి విజయం సాధించిం ది. ఒక్కో ఎపిసోడ్ కు 2 కోట్లు తీసుకున్నాడు. మొత్తం 16 ఎపిసోడ్లకు 3.65 మిలియన్ డాలర్లు అందుకు న్నాడు.
అలాగే `క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు డ్రామా` తో పాపులర్ అయిన నటుడు హ్యాస్ బిన్. కొరియన్ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వాళ్లలో హ్యాస్ ఒకరు. క్రాష్ ల్యాండ్ 16 ఎపిసోడ్లకు కలిపి 1.8 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకున్నాడు. పచ్చింకో కొరియన్ షోతో లీ మిన్ హో బాగా పాపులర్ అయ్యాడు. అతడు భారీగానే పారితోషికం అందుకున్నాడు.