కోటబొమ్మాళి.. ఎలా ఉంటుందంటే..: వరలక్ష్మి శరత్ కుమార్

ఇక టాలెంటెడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇందులో కీలకమైన పాత్రలో నటించగా మరో స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్ర పోషించారు.

Update: 2023-11-17 16:48 GMT

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి వస్తున్న కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. సినిమా నుంచి వస్తున్న సాంగ్స్ అప్డేట్స్ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో నటించగా ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ దీన్ని తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇక టాలెంటెడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇందులో కీలకమైన పాత్రలో నటించగా మరో స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్ర పోషించారు.


గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్ అలాగే విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా. నవంబర్ 24న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకున్నారు. వరలక్ష్మి మాట్లాడుతూ.. నా సినిమా జర్నీలో ఈ మధ్య ఎక్కువ పోలీస్ పాత్రలలో నటించే అవకాశం వస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లో చాలా చేశాను. అయితే తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నా.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ జానర్ లలో ఎక్కువగా సినిమాలు వస్తున్న టైమ్ లో ఈ సినిమా కూడా బాగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ కు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా. నేను కథను హీరోగా భావిస్తాను. శ్రీకాంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ తీరు బాగుంది.

ఇక ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది.. అసలు పోలీసులపై పొలిటికల్ ఒత్తిడి ఏ విధంగా ఉంటుందనేది అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోట బొమ్మాలి క్యాట్ అండ్ మౌస్ గేమ్‌ తరహాలో థ్రిల్ చేస్తుంది. ముఖ్యంగా స్ర్కిన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ఎలక్షన్ టైమ్‌లోనే ఇలాంటి మంచి కథలు వస్తుండడం విశేషం.

అలాగే ఓటు గురించి అవగాహన కల్పించేలా లైన్ కూడా ఈ కథలో ఉంది. ‘నాయట్టు’కి రీమేక్ అయినప్పటికి చాలా మార్పులు చేశారు. ఇక క్యారెక్టర్ రన్ టైమ్ ఎక్కువే. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి సినిమాల్లో అయినా నటించడానికి రెడీ. ఇక నేను నటించిన సినిమాలలో సంక్రాంతికి హనుమాన్‌ రాబోతోంది. అలాగే కన్నడలో సుదీప్‌తో కలిసి మ్యాక్స్ సినిమాలో నటిస్తున్నా. ఇక ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే వాటిపై క్లారిటీ వస్తుంది.. అని వరలక్ష్మీ శరత్ కుమార్ వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News